KCR: KCR: నేడు నల్గొండ దద్దరిల్లేలా కేసీఆర్‌ బహిరంగ సభ

తెలంగాణ మొట్టమొదటి సీఎం కేసీఆర్ (KCR)..మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. కృష్ణా జలాల వివాదం నేపథ్యంలోనే కేసీఆర్‌ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. రణరంగంలోకి దూకుతున్నారు తెలంగాణ

KCR: KCR: నేడు నల్గొండ దద్దరిల్లేలా కేసీఆర్‌ బహిరంగ సభ
X

KCR: తెలంగాణ మొట్టమొదటి సీఎం కేసీఆర్ (KCR)..మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. కృష్ణా జలాల వివాదం నేపథ్యంలోనే కేసీఆర్‌ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. రణరంగంలోకి దూకుతున్నారు తెలంగాణ మొట్టమొదటి సీఎం కేసీఆర్. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు నేరుగా ప్రజల మధ్యకు వచ్చేందుకు రెడీ అయ్యారు.

ఇవాళ నల్గొండలో (Nalgonda) బీఆర్ఎస్ (BRS) భారీ బహిరంగ సభ. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ (KCR)నేరుగా ప్రజల వద్దకు రావడం ఇదే తొలిసారి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఈ మీటింగ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి.

తమ అభిమాన నాయకుడు స్పీచ్ వినేందుకు గులాబీ కార్యకర్తలు నల్గొండకు (Nalgonda) క్యూ కట్టారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో ఈ సభ జరిగింది. 50 ఎకరాల స్థలంలో జరగనున్న భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతు గర్జన పేరిట ఈ సభ జరగనుంది.

Tags:
Next Story
Share it