KTR: ఆత్మహత్య చేసుకున్న 218 మంది రైతుల వివరాలు పంపిస్తాం

ఆత్మహత్య చేసుకున్న 218 మంది రైతుల వివరాలు పంపిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖైరతాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్ లలో ఉప ఎన్నికలు పక్కా

KTR: ఆత్మహత్య చేసుకున్న 218 మంది రైతుల వివరాలు పంపిస్తాం
X

KTR: ఆత్మహత్య చేసుకున్న 218 మంది రైతుల వివరాలు పంపిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖైరతాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్ లలో ఉప ఎన్నికలు పక్కా వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఖచ్చితంగా పోతాయని... ఈ ఆదివారం లోపు స్పీకర్ తేల్చకుంటే..కోర్టుకు పోతామని వెల్లడించారు. సుప్రీం కోర్టు తీర్పు కూడా అనర్హత వేయాలని ఉందని గుర్తు చేశారు కేటీఆర్‌.

ఇవాళ తెలంగాణ భవన్‌ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ...రిజర్వాయర్లలో నీళ్ళు ఉన్న ఇవ్వకుండా దాచిపెట్టి.. పంటలు ఎండపెట్టి, ప్రజల గొంతు ఎండపెట్టిన దరిద్రపు పాలన కాంగ్రెస్ పార్టీదని ఆగ్రహించారు. కేసీఆర్ మీద కక్షతో మొదటినుండి కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని ఫైర్‌ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

కానీ కేసీఆర్ గారు జనగామ, సూర్యాపేట, నల్గొండ వెళ్ళగానే.. నంది, గాయత్రి పంప్ హౌజ్‌లు నడుస్తున్నాయి.. నీళ్ళు పరుగులు పెడుతున్నాయని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు....ఈ వివరాలు అన్ని రేవంత్ రెడ్డి కి పంపిస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదని తెల్చి చెప్పారు.

Tags:
Next Story
Share it