KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు కేటీఆర్...షెడ్యూల్ ఇదే

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పయనం కానున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నేడు సిరిసిల్ల

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు కేటీఆర్...షెడ్యూల్ ఇదే
X

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పయనం కానున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ప్రకటన విడుదల అయింది. ఈ పర్యటనలో సర్దాపూర్ లో పెద్దమ్మ పెద్దిరాజుల సిద్ధోగంలో పాల్గొననున్నారు మాజీ మంత్రి కేటీఆర్.

అంతేకాదు.. వీర్నపల్లి మండలం రంగంపేటలో సీతారామ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని, బంజేరు తండా లో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.

అనంతరం గంభీరావుపేట మండల కేంద్రంలో ఇఫ్తార్ విందుతోపాటు, పలు వివాహాలకు హాజరై, ఇటీవల చనిపోయిన వారి కుటుంబీకులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించనున్నారు. వారంలో ఒకసారైనా రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కేటీఆర్‌. దానికి తగ్గట్టుగానే.. కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళుతున్నారు.

Tags:
Next Story
Share it