KTR : అసెంబ్లీ లో అదరగొట్టిన హరీష్ రావు ని అభినందించిన కేటీఆర్!

నేడు జరిగిన అసెంబ్లీ సమావేశం లో హరీష్ రావు మాట్లాడిన మాటలకు సోషల్ మీడియా లో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రతీ మాటకు కౌంటర్ గా ఆయన సమాధానం ఇచ్చిన తీరు అద్భుతం అనే చెప్పాలి. హరీష్ రావు మాట్లాడిన తీరు ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ లో అభినందించారు.

KTR : అసెంబ్లీ లో అదరగొట్టిన హరీష్ రావు ని అభినందించిన కేటీఆర్!
X

న్యూస్ లైన్, హైదరాబాద్ : నేడు జరిగిన అసెంబ్లీ సమావేశం లో హరీష్ రావు మాట్లాడిన మాటలకు సోషల్ మీడియా లో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రతీ మాటకు కౌంటర్ గా ఆయన సమాధానం ఇచ్చిన తీరు అద్భుతం అనే చెప్పాలి. హరీష్ రావు మాట్లాడిన తీరు ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ లో అభినందించారు. ఆయన మాట్లాడుతూ 'ఈరోజు అసెంబ్లీ లో హరీష్ రావు గారు అద్భుతమైన ప్రసంగం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి ని, ఆయన క్యాబినెట్ మొత్తానికి సరైన రీతిలో సమాధానం చెప్పారు. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలు, అబద్ధాలను ఆధారాలతో సహా చూపించి వాళ్లకు నోటి నుండి మాట రానివ్వకుండా చేసారు. రేపు చలో నల్గొండ సభకి కావాల్సిన వేడి పుట్టింది. రేపు సభలో కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్యపు ప్రచారాలు, అబద్దాలను తనదైన శైలి లో ఖండించబోతున్నారు' అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Tags:
Next Story
Share it