KTR: కాంగ్రెస్ కు షాక్.. ఆ నోటీసులు పంపిన కేటీఆర్

తాను నిన్న చెప్పిన్నట్టే కాంగ్రెస్ నాయకులకు లీగల్ నోటీసులు పంపారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పుడు అరోపణలు చేసిన మంత్రి కొండా

KTR: కాంగ్రెస్ కు షాక్.. ఆ నోటీసులు పంపిన కేటీఆర్
X

KTR: తాను నిన్న చెప్పిన్నట్టే కాంగ్రెస్ నాయకులకు లీగల్ నోటీసులు పంపారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పుడు అరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి లకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. ఇక అటు తెలంగాణ భవన్‌ లో ఇవాళ కేటీఆర్‌ ఇదే విషయంపై మాట్లాడారు. 2011 నుండి జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ ఆధారాలు అన్ని బయటపెట్టండి...అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఫోన్ ట్యాపింగ్ చేసింది ఇప్పుడున్న అధికారులేనని తెలిపారు కేటీఆర్‌.

2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆంధ్ర సీఎం, తెలంగాణ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. 2004లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్‌ మీద ఆధారాలు తియ్యండి.. ఎవరి బొక్కలు ఏంటో అప్పుడు తెలుస్తాయని స్పష్టం చేశారు. అధికారులు మారలేదు.. ప్రభుత్వం మారిందని వెల్లడించారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.

Tags:
Next Story
Share it