Congress party: కాంగ్రెస్‌లో కల్లోలం..?

రాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి

Congress party: కాంగ్రెస్‌లో కల్లోలం..?
X

కలకలం రేపిన పొంగులేటి వీడియో

ఖమ్మం ఎమ్మెల్యేలతో పొంగులేటి టూర్

వీళ్లతో పాటే బీఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్ రెడ్డి

బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి ఉండటంతో అనుమానాలు

మరో విమానంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేల టూర్

మంత్రి శ్రీధర్‌బాబుతో భట్టి విక్రమార్క భేటీ

రేవంత్‌కు పొంగులేటి మధ్య ఏం జరుగుతోంది..?

పాతోళ్లు.. కొత్తోళ్ల మధ్య పంచాయతీ..?

ఆసక్తికరంగా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం

హైలైట్...

లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తారని కొందరు చెబితే.. వేరేనేతలు వస్తున్నారని మరొకరు చెప్పారు. సీన్ కట్ చేస్తే.. మంగళవారం రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొందరు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో ఓ విమానంలో కనిపించడం పొలిటికల్ హీట్ పెంచింది. వీళ్లంతా ఎటు వెళ్తున్నారు.? అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది.? బీజేపీ చెప్పినట్టు సర్కారును కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ మొదలైంది.

తెలంగాణం, హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారిని టెన్షన్ పెట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా నేతలతో టూర్ వెళ్లడం హాట్ టాఫిక్‌గా మారింది. కొంత మంది జిల్లా నేతలతో విమానంలో వెళ్తుండగా అది సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. ఈ సమయంలో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మొవ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఉండటం సంచలనంగా మారింది. ఇంత మంది ఎమ్మెల్యేలను తీసుకొని పొంగులేటి ఎక్కడికి వెళ్లాడు..? అందులో పైలెట్ రోహిత్ రెడ్డి ఎందుకున్నాడనే అనుమానాలు మొదలయ్యాయి. తెర వెనక ఏదో జరుగుతోందనే చర్చ రాజకీయవర్గాల్లో, సోషల్ మీడియాలో జరిగింది.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరగణంతో పార్టీ మారతాడనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. కాంగ్రెస్ లో అయితే రేవంత్ రెడ్డి, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏక్ నాథ్ షిండే అవుతారని ప్రచారం కూడా జరిగింది. దీంతో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే సొంత పార్టీ నేతలతో పాటు అటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన పైలెట్ రోహిత్ రెడ్డి ఒకే ఫ్లైట్‌లో ఉండటంతో పార్టీ మార్పు అంశం రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది. ప్రస్తుతం ముఖ్యమంత్రికి కొరకరాని కొయ్యలా పొంగులేటి తయారయ్యారనే ప్రచారం కూడా జరిగింది. ఒక దశలో ఎమ్మెల్యేలను లాగేసి ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అలాంటిదేం లేదని ఆయన మీడియాను పిలిచి లంచ్ పెట్టి మరీ చెప్పారు. అయినా.. సీఎం పదవి కోసం తెరవెనక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఏందో జరగబోతోందన్న అనుమానాలను కలిగిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా టూర్ వెళ్లినట్టు సమాచారం. వీరిని ఎవరు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్లారనేది మాత్రం క్లారిటీ రాలేదు. వారిని ఎవరు తీసుకెళ్లారనేది కూడా తెలియడం లేదు.

మంత్రి పొంగులేటి తన అనుచరులుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బహిరంగంగానే బీజేపీవాళ్లు చెప్పారు. ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి విమానంలో కనిపించడంపై రాజకీయంగా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ టచ్ లోకి వెళ్లారా..? లేకపోతే తన అనుచరవర్గంతో వేరు కుంపటి పెడుతున్నారా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు బీఆర్ఎస్‌తో ఏమైనా సంప్రదింపులు జరుగుతున్నాయా.? అనే మాట కూడా వినిపిస్తోంది.

*స్పెషల్ బాక్స్‌ లో ఈ వార్త వాడుకోవాలి*

ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు టూర్లలో ఉంటే ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంగళవారం శ్రీధర్ బాబు సొంతూరు ధన్వాడలో జరిగిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం శ్రీధర్ బాబుతో భట్టి విక్రమార్క భేటీ అయినట్లు సమాచారం. వీరి భేటీలో ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నేతల టూర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలోని సీనియర్లు అంతా కలిసి పార్టీని కాపాడుకోవాలని, బీజేపీ చేసిన కామెంట్స్ ను లైట్ తీసుకోవద్దని చర్చించారని సమాచారం. ఇందులోనూ ఉమ్మడి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు వర్గంగా పేరున్న ముఖ్యనేతలు మాత్రమే పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ విదేశీ పర్యటన ఉండటంతో రాలేదని వారి అనుచరులు చెబుతున్నా.. ఆయన వర్గంగా పేరున్న లీడర్లు కూడా ఈ కార్యక్రమానికి దూరం ఉన్నారు. దీంతో ఇది కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Tags:
Next Story
Share it