MMTS : అందుబాటులోకి రానున్న MMTS కొత్త లైన్స్‌

హైదరాబాద్‌ నగరంలోని ప్రయాణికులకు అలర్ఠ్. హైదరాబాద్‌ ఎంఎంటీఎస్ (MMTS) రెండో దశ పనులు మొత్తం పూర్తయ్యాయి. ప్రధానంగా సనత్ నగర్-మౌలాలి మధ్య ఎంఎంటీఎస్

MMTS : అందుబాటులోకి రానున్న MMTS కొత్త లైన్స్‌
X

MMTS : హైదరాబాద్‌ నగరంలోని ప్రయాణికులకు అలర్ఠ్. హైదరాబాద్‌ ఎంఎంటీఎస్ (MMTS) రెండో దశ పనులు మొత్తం పూర్తయ్యాయి. ప్రధానంగా సనత్ నగర్-మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైను సిద్ధమైంది. రక్షణశాఖ - రైల్వేశాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి. రెండోదశలో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుదీకరణ, స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి మార్చి మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు.

అదేరోజు సనత్ నగర్-మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండోదశ ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లను కూడా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ - ఘట్కేసర్ లైన్ కూడా అదే రోజు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చర్లపల్లి స్టేషన్ ప్రారంభమయ్యాక అక్కడి నుంచి 25 జతల దూర ప్రాంతాల రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికులు అందించాలన్న, అక్కడ దిగిన వారిని నగరానికి తీసుకురావాలన్న ఎంఎంటీఎస్ లో సమయానికి నడవాల్సిన అవసరం ఉంది. సనత్ నగర్ - మౌలాలి లైనుతోనే ఇది సాధ్యమవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Tags:
Next Story
Share it