ACB : అవినీతి చేస్తున్న మరో ప్రభుత్వాధికారిని అరెస్ట్ చేసిన ఏసీబీ!

అవినీతి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పై ఏసీబీ సంస్థ ఉక్కుపాదం మోపిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంత పెద్ద వారు అయినా అవినీతి చేస్తే క్షమించేది లేదని, కటకటాల వెనుకకు పంపుతామని ఏసీబీ అధికారులు వార్నింగ్ ఇచ్చి, ఆ వార్నింగ్ కి తగ్గట్టుగానే అవినీతి చేస్తున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు.

ACB : అవినీతి చేస్తున్న మరో ప్రభుత్వాధికారిని అరెస్ట్ చేసిన ఏసీబీ!
X

న్యూస్ లైన్, హైదరాబాద్: అవినీతి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పై ఏసీబీ సంస్థ ఉక్కుపాదం మోపిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంత పెద్ద వారు అయినా అవినీతి చేస్తే క్షమించేది లేదని, కటకటాల వెనుకకు పంపుతామని ఏసీబీ అధికారులు వార్నింగ్ ఇచ్చి, ఆ వార్నింగ్ కి తగ్గట్టుగానే అవినీతి చేస్తున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. శివ బాలకృష్ణ ఆటల్ని కట్టడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ & కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ జగన్‌మోహన్‌ని అరెస్ట్ చేసారు. హైదరాబాద్ లో ఒక బిల్డింగ్ కి అక్రమంగా అనుమతి ఇచ్చేందుకు 50,000 రూపాయిలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేశారు. జగన్ మోహన్ ని అదుపులోకి తీసుకున్న అధికారులు అతని నుండి మరిన్ని వివరాలు లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతం లో శివ బాలకృష్ణ ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతని వెనుక ఉన్న అవినీతి అధికారులందరూ బయటపడ్డారు. ఇప్పుడు జగన్ మోహన్ విషయం లో కూడా అలా జరుగుతుందో లేదో చూడాలి.

Tags:
Next Story
Share it