Phone Tapping: "బ్లాక్ మాంబా" ఎవరు..?

ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కొందరు వ్యక్తులను రేవంత్ రెడ్డి సర్కారు కావాలనే కాపాడుతోదనే ప్రచారం జరుగుతోంది.

Phone Tapping: బ్లాక్ మాంబా ఎవరు..?
X

ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపులు

సంచలనంగా "బ్లాక్ మాంబా" వ్యవహారం

తెరవెనక ఉన్న అధికారులెవరు..?

తెరముందుకు రాకుండా ఆపుతున్నదెవరు..?

సంచలన కేసు అంటూనే దాగుడు మూతలు ఎందుకు..!

పాత చిట్టా తీయొద్దని అడ్డుకుంటున్నది ఎవరు..?

2016 కంటే ముందు చిట్టా తీయొద్దు అంటున్నదెవరు..?

2022 కంటే ముందు చిట్టాను ముట్టుకోనేవద్దంటున్నదెవరు..?

కేసును లీడ్ చేస్తున్నది శివధర్ రెడ్డేనా..?

లేకపోతే "కొత్త" ఆఫీసర్‌కు అప్పజెప్పారా..?

కీ రోల్ పోషించిన "బ్లాక్ మాంబా" ఎక్కడపోయారు..?

రఘునందన్ రావు ప్రెస్‌మీట్ సారాంశమేంటీ ?

బీజేపీ రంగప్రవేశంలో అసలు ఏం జరగబోతోంది ?

చివరగా ఫోన్ ట్యాపింగ్ కేసు..ఎవరికి మెడకు..

చుట్టుకోబోతోంది ?

ఉద్యమం సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన..

అధికారులు ఇప్పుడే పొజీషన్ లో ఉన్నారు ?

వణికిపోతున్న ప్రభుత్వ పెద్ద, ఆ పెద్ద ఆఫీసర్ ఎవరు ?

హైలైట్ బాక్స్..

రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. మరికొందరు అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని లీకులు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలే ఇదంతా చేయించారనే ప్రచారం ఇప్పటికే మొదలు పెట్టింది కాంగ్రెస్ అనుకూల మీడియా. కానీ ఈ కేసులో అసలు తలకాయలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. కావాలనే కొందరిని ఇరికించి మరికొందరిని తప్పించారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఓ వ్యక్తి మాత్రం ఇందులో చాలా కీలకంగా వ్యవహరించారని ఆయన్ను ఎందుకు కేసులో చేర్చడం లేదనే వాదన వినిపిస్తోంది. ఆ కీలకమైన వ్యక్తి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణం, హైదరాబాద్: ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కొందరు వ్యక్తులను రేవంత్ రెడ్డి సర్కారు కావాలనే కాపాడుతోదనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఒకవేళ ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని బయటకు తీయాలనుకుంటే.. పదేళ్ల కాలంలో జరిగిన చిట్టా మొత్తం బయటకు తీయాలి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. కేవలం కొన్ని అంశాలే లక్ష్యంగా చేసుకుని కొందరు పోలీసు అధికారులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో మరింత లోతుగా వెళితే విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుత పాలకులు ఒక లక్ష్యంతో తీగ లాగడం మొదలుపెడితే.. దాని డొంక వారు ఊహించిన చోట కాకుండా మరోచోట కదిలిందని సమాచారం. దీంతో కొందరు అధికారుల్లో టెన్షన్ మొదలైందని తెలుస్తోంది. అందుకే కేసును రోజుకు మలుపుతిప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ టాపింగ్ చిట్టా తీయాలంటే.. గతంలో ఏం జరిగిందనే వివరాలు కూడా రాబట్టాలి. కానీ కొందరు అధికారులు దానికి అడ్డుపడుతున్నారట. 2016 కంటే ముందు ఫోన్ టాపింగ్ చిట్టా తీయొద్దని ఇప్పుడు మాంచి పొజీషన్ లో ఉన్న ఓ అధికారు పట్టుపడుతుంటే... 2022 కంటే ముందు చిట్టా తీయొద్దని మరో పే...ద్ద అధికారి ప్రస్తుత సర్కారు పెద్దల శరణుకోరారని తెలుస్తోంది. ఇక తెలంగాణ ఉద్యమ సమయానికి సంబంధించి చిట్టా జోలికి పోనేపోవద్దని మరికొందరు అధికారులు రాయబారాలు నడిపిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం రిటైర్డ్ అయిన వారు, వివిద పదవుల్లో ఉన్నవారు కూడా శరణుగోరుతున్న ఈ బ్యాచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఏం దర్యాప్తు చేయాలనుకున్నా 2022 తర్వాతి నుంచే చేయండి.. అంతకుముందు వాటి జోలికి వెళ్లొద్దని వీరంతా కాళ్లా వేళ్లా పడుతున్నారని సమాచారం. ఇందులో ఐపీఎస్, నాన్ ఐపీఎస్ వ్యవహారం కూడా ఉన్నట్టుగా తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఉన్న కొందరు ఐపీఎస్ లు ప్రభుత్వ పెద్దల మాటను లెక్కచేయకుండా వ్యవహరించడంతో వారిని తొలగించి ఆ స్థానంలో కొత్తవాళ్లను నియమించారు. అలాగే ప్రస్తుతం ఫోన్ టాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు కొద్దికాలం పాటు ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. దానికి ముందు ఆయన ఎస్ఐబీ చీఫ్ గా ఉన్నారు. కానీ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఇంటలిజెన్స్ చీఫ్ పదవి ఇచ్చారంటూ విమర్శలు రావడంతో ఆయనను మళ్లీ ఎస్ఐబీకి పంపి.. ఆ స్థానంలో వేరే అధికారిని నియమించారు. అయితే.. ప్రభాకర్ రావు గ్రూప్ 1 ఆఫీసర్ కావడంతో ఐపీఎస్ లు కూడా అడ్డుచెప్పారని ప్రచారం జరిగింది. దీంతో అప్పటి నుంచి కొందరు ఐపీఎస్ లు ఆనాటి బీఆర్ఎస్ సర్కారుకు హ్యాండిచ్చారనే ప్రచారం పోలీస్ సర్కిళ్లలోనే జరిగింది. ఆ తర్వాత 2019 నుంచి వీళ్లంతా.. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తికి సమాచారం ఇవ్వడం మొదలు పెట్టారని తెలుస్తోంది. లా అండ్ ఆర్డర్ కు సంబంధించి రహస్యంగా ఉండాల్సిన అంశాలను కూడా వీళ్లు తమ స్వలాభం కోసం ఆ వ్యక్తికి చేరవేసే వాళ్లని తెలిసింది. ఇంటలిజెన్స్ విభాగం చేసిన ప్రతీ ఆపరేషన్ గురించి ఆ వ్యక్తికి ఎప్పటికప్పుడు సమాచారం అందించారని వినికిడి. అయితే ఐపీఎస్ - నాన్ ఐపీఎస్ వివాదంతో పాటు.. తమ గొప్పల కోసం కావాలనే లేనివి పోనివి చెప్పారని దాని ఆధారంగానే ఈ కేసు బయటకు వచ్చిందని తెలుస్తోంది. అందుకే ఓ సామాజిక వర్గానికి చెందిన అధికారులనే టార్గెట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం నడుస్తున్న రోజుల్లో ఉద్యమకారుల ఫోన్లు టాప్ చేశారనే ఆరోపణలు అనేకసార్లు వచ్చాయి. అయితే.. కేవలం కొద్దిమంది అధికారులను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో మొదలుపెట్టిన వ్యవహారం.. గత చరిత్ర మొత్తాన్ని బయటపెట్టేలా ఉండటంతో.. ఆనాడు పనిచేసిన అధికారుల్లో గుబులు మొదలైందని తెలుస్తోంది. అందులో బ్లాక్ మాంబా చాలా కీలకంగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఫోన్ టాపింగ్ తవ్వకాలు మరింత లోతుగా వెళ్లకుండా శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని సమాచారం. బ్లాక్ మాంబాను అరెస్ట్ చేస్తే.. అత్యంతకీలక విషయాలు బయటకు వస్తాయని పోలీసు శాఖకు చెందిన కొందరు ఆఫ్ ది రికార్డ్ గా చెప్పారు.

Tags:
Next Story
Share it