Rachana Reddy :

సంగారెడ్డి జిల్లాలో మెడికో రచనా రెడ్డి(25) (Rachana reddy) అనుమానస్పద మృతి చెందిన సంగతి తెలిసిందే. ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో రచనా రెడ్డి(25) అనే మెడికో

Rachana Reddy :
X

Crime: సంగారెడ్డి జిల్లాలో మెడికో రచనా రెడ్డి(25) (Rachana reddy) అనుమానస్పద మృతి చెందిన సంగతి తెలిసిందే. ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో రచనా రెడ్డి(25) అనే మెడికో PG చదువుతున్నారు. ప్రస్తుతం బాచుపల్లి మమత కాలేజీలో ఇంటర్న్ షిప్ చేస్తోంది రచనా. అయితే..సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారులో అపస్మారక స్థితిలో రచనా రెడ్డి(25) (Rachana reddy) పడి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.

ఇక అనంతరం రచనా రెడ్డిని (Rachana reddy) ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించారు వైద్యులు. మత్తు ఇంజెక్షన్ తో రచన అపస్మారక స్థితికి వెళ్లి చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. గతేడాది నవంబర్ లో రచనా రెడ్డికి ఎంగేజ్ మెంట్ అయిందని.... వచ్చే నెల మార్చిలో ఆమె పెళ్లి కూడా ఉన్నట్లు సమాచారం.

ఈ తరుణంలోనే..రచనా రెడ్డి కేసులో కొత్త కోణం తెరపైకి వచ్చింది. ఎంగేజ్మెంట్ (Engegement) జరిగిన అబ్బాయితో రచనా రెడ్డికు (Rachana reddy) మనస్పర్థలు ఏర్పాడ్డాయట. దీంతో కొద్దిరోజులుగా డిప్రెషన్ లోకి రచనా రెడ్డి వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ తరుణంలోనే.. సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కారులో రచనా రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. చేతికి మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Tags:
Next Story
Share it