Sangareddy : సంగారెడ్డిలో ఘోరప్రమాదం..కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు!

ఇటీవల కాలం లో తెలంగాణ లో ఎన్నో అగ్ని ప్రమాదాలు, ఎన్నో పేలుళ్లు సంభవించాయి. కారణాలు ఏవైనా ప్రతీ రోజు వార్తల్లో ఇలాంటివి చూడడం మన హృదయాలకు ఎంత బాధని కలిగిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Sangareddy : సంగారెడ్డిలో ఘోరప్రమాదం..కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు!
X

న్యూస్ లైన్, సంగారెడ్డి: ఇటీవల కాలం లో తెలంగాణ లో ఎన్నో అగ్ని ప్రమాదాలు, ఎన్నో పేలుళ్లు సంభవించాయి. కారణాలు ఏవైనా ప్రతీ రోజు వార్తల్లో ఇలాంటివి చూడడం మన హృదయాలకు ఎంత బాధని కలిగిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి దారుణమైన సంఘటన నేడు సంగారెడ్డి లో మరోసారి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా లోని హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ సంఘటన కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో, పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులలో 7 మంది చనిపోగా, 9 నుండి 10 మంది కార్మికులు తీవ్రమైన గాయాలపాలయ్యారు. ఈ సంఘటన కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. గాయాలపాలైన కార్మికులను ఆసుపత్రిలో చేర్చగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it