Telangana: ఈ నెల 16 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు !

తెలంగాణ (Telangana) శాసనసభ సమావేశాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఉదయం 10 గంటలకే తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి

Telangana: ఈ నెల 16 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు !
X

Telangana: తెలంగాణ (Telangana) శాసనసభ సమావేశాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఉదయం 10 గంటలకే తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేఆర్‌ఎంబీ వివాదంపై చర్చ జరుగుతోంది. అలాగే... ఇవాల్టి సమావేశాల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. తొలుత ఈనెల 13వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రేపు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని (Medigadda) సందర్శించాలని తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సందర్శన తర్వాత సాగునీటి శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున శాసనసభ జరిగే అవకాశం లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరగాల్సిన బడ్జెట్ పై చర్చ ఈ నెల 14వ తేదీన ఉండనున్నట్లు సమాచారం. ఈనెల 15వ తేదీన నీటిపారుదల శాఖ అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి ఇంకో రోజు కూడా పొడిగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ విషయమై ఇవాళ శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. అంటే తెలంగాణ (Telangana) శాసనసభ సమావేశాలు ఈ నెల 16 వరకు జరిగే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Tags:
Next Story
Share it