Telangana : ప్రభుత్వ పక్షపాతిగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం..మరీ ఇంత అన్యాయమా!

తెలంగాణ లో ఎన్నికల సంఘం ప్రభుత్వ పక్షపాతిగా వ్యవహరిస్తుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Telangana : ప్రభుత్వ  పక్షపాతిగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం..మరీ ఇంత అన్యాయమా!
X

న్యూస్ లైన్, హైదరాబాద్: తెలంగాణ లో ఎన్నికల సంఘం ప్రభుత్వ పక్షపాతిగా వ్యవహరిస్తుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కాంగ్రెస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. అంటే కేసీఆర్ కి వ్యతిరేకంగా ఈసీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈసీ ప్రభుత్వ పక్షపాతి అయిపోతుందా అని మీరు అనుకోవచ్చు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక పది నిమిషాలు ప్రసంగిస్తే, అందులో వంద బూతులు కేసీఆర్ మీద ఉంటాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి రౌడీ తరహా భాషని ఈసీ గమనించలేదా..?, ఎన్నో సందర్భాలలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఈమధ్య కాలం లో కేసీఆర్ ని సన్నాసి అని తిట్టినా సందర్భాలు ఉన్నాయి, మరి రేవంత్ పై ఈసీ ఎందుకు యాక్షన్ తీసుకుపోలేదు అనేదే ప్రశ్న. ఇలా చేస్తే రెండు రోజుల కేసీఆర్ ప్రచారానికి అంతరాయం కలిగించిన వారు అవుతారేమో కానీ, జనాల్లో కేసీఆర్ కి సానుభూతి మరింత పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Tags:
Next Story
Share it