Bihar: బిహార్‌ రాజకీయాల్లో ముగిసిన కీలక ఘట్టం.. అసెంబ్లీలో బలపరీక్ష!

బిహార్‌ రాజకీయాల కథ సుఖాంతమైంది. బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ బలపరీక్షలో తన బలం నిరూపించుకుని అధికారాన్ని నిలబెట్టుకున్నారు.

Bihar: బిహార్‌ రాజకీయాల్లో ముగిసిన కీలక ఘట్టం.. అసెంబ్లీలో బలపరీక్ష!
X

Bihar: బిహార్‌ రాజకీయాల కథ సుఖాంతమైంది. బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌(Nithish kumar) బలపరీక్షలో తన బలం నిరూపించుకుని అధికారాన్ని నిలబెట్టుకున్నారు. మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్‌ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 122 కాగా, నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వానికి మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. బీజేపీ 78, నితీష్‌ కుమార్‌ పార్టీ జేడీయూ 45, జితిన్‌ రామ్‌ మంఝీకి చెందిన ఆవామ్‌ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలు, ఒకరు స్వతంత్య్ర ఎమ్మెల్యే ఓటు వేశారు. ఓటింగ్ సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు. ఇక ఈ ఓటింగ్‌లో ముగ్గురు ఆర్జేడీ(RJD) ఎమ్మెల్యేలు.. నితీశ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయడం సంచలనంగా మారింది.

ఇటీవలే జేడీయూ ( )- రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహా ఘట్‌బంధన్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. సీఎం నితీష్ కుమార్.. తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఎన్డీఏ(NDA) కూటమిలో చేరారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తనకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ(JDU), బీజేపీ(BJP)- దాని మిత్రపక్షాల శాసన సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. అయితే అంతకుముందు అసెంబ్లీ స్పీకర్‌ అవధ్ బిహారీ చౌధరీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి.. ఆయనను స్పీకర్ స్థానం నుంచి తొలగించిన తర్వాత ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. బీహార్ అసెంబ్లీ స్పీకర్, ఆర్జేడీ నేత అవథ్ బిహారీ చౌదరీపై.. బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ యాదవ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా 125 మంది సభ్యులు ఓటు వేయడం వల్ల ఆయన స్పీకర్పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇక అవిశ్వాసానికి వ్యతిరేకంగా 112 మంది ఓటు వేశారు.

మరోవైపు ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్(TEJASWI YADAV) మాట్లాడుతూ.. సభలో బలాన్ని నిరూపించుకున్నంత మాత్రాన ప్రజల్లో ఆదరణ పొందినట్లు కాదని తేజస్వి యాదవ్ విమర్శించారు. అయిదు సంవత్సరాల కాలపరమితిలో ఒకే వ్యక్తి వేర్వేరు పార్టీల తరఫున మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దేశ చరిత్రలోనే లేదంటూ విమర్శించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.

Tags:
Next Story
Share it