KTR: కేటీఆర్, హరీష్ రావు ప్రయాణిస్తున్న వాహనంపై గుడ్లతో దాడి

తెలంగాణ మాజీ సీఎం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

KTR: కేటీఆర్, హరీష్ రావు ప్రయాణిస్తున్న వాహనంపై గుడ్లతో దాడి
X

KTR: తెలంగాణ మాజీ సీఎం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు కేటీఆర్‌, హరీశ్‌రావులకు కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి అనూహ్య నిరసన ఎదురైంది. మాజీ మంత్రులు ప్రయాణిస్తున్న బస్సుపై కోడి గుడ్లు దాడి చేశారు. కృష్ణా జలాల హక్కుల సాధన పేరుతో నిర్వహించిన చలో నల్గొండ బహిరంగ సభకు అగ్రనేతలు, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు తరలివెళుతున్న బస్సును ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. బస్సుపై కోడిగుడ్లు విసిరారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు గోబ్యాక్ అని విమర్శించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని వారి కాలనీలో అడ్డుకున్నారు. అనంతరం బీఆర్‌ఎస్ నేతలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

Tags:
Next Story
Share it