Kamareddy: ఐసీయూలో ఎలుక కరిచిన ఘటనలో ట్విస్ట్..!

కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్ ను ఎలుకలు కరిచాయి. కామారెడ్డి జిల్లా (Kamareddy) కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో

Kamareddy: ఐసీయూలో ఎలుక కరిచిన ఘటనలో ట్విస్ట్..!
X

Kamareddy: కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్ ను ఎలుకలు కరిచాయి. కామారెడ్డి జిల్లా (Kamareddy) కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన షేక్ ముజీబ్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. అయితే.. ఈ సంఘటనపై అధికారులు స్పందించారు. దీంతో ఐసీయూలో ఎలుక కరిచిన ఘటనపై ఇద్దరు డాక్టర్లు డాక్టర్ కావ్య, డాక్టర్ వసంత్ కుమార్, ఓ స్టాఫ్ నర్స్ మంజుల సస్పెన్షన్ వేటుకు గురయ్యారు.

దీంతో ఆసుపత్రిలో ఎలుకలు ఉండకుండా చూడాల్సిన భాద్యత శానిటేషన్ సిబ్బంది మరియు సంబంధించిన అధికారుల విషయం అయితే డాక్టర్లను సస్పెండ్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్. అయితే ఘటన జరగక ముందు ఫిబ్రవరి 9 నుంచి గాంధీ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ ఎగ్జామినర్‌గా డ్యూటీలో ఉన్న డాక్టర్ వసంత్‌ను సస్పెండ్ చేయడం వివాదాస్పదం అవుతోంది. 24 గంటల్లో సస్పెన్షన్ ఎత్తివేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీచింగ్ డాక్టర్లు అంతా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

Tags:
Next Story
Share it