Vinay Bhaskar:కాకతీయ కళా తోరణం తొలగిస్తే... ఓరుగల్లు నుంచే ఉద్యమిస్తాం

కాకతీయ కళా తోరణం తొలగిస్తే... ఓరుగల్లు నుంచే ఉద్యమిస్తామని హెచ్చరించారు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhaskar). హన్మకొండ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ

Vinay Bhaskar:కాకతీయ కళా తోరణం తొలగిస్తే... ఓరుగల్లు నుంచే ఉద్యమిస్తాం
X

Vinay Bhaskar: కాకతీయ కళా తోరణం తొలగిస్తే... ఓరుగల్లు నుంచే ఉద్యమిస్తామని హెచ్చరించారు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhaskar). హన్మకొండ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ...తెలంగాణ ప్రభుత్వ చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణం,చార్మినార్ ను (Charminar) తొలగిస్తారని తెలిసి ప్రజలు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. లేకపోతే ఓరుగల్లు నుండే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. కాకతీయ కళా తోరణంకు (Kakathiya kalathoranam) పెద్ద చరిత్ర ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి... తెలంగాణ చరిత్రను రూపు మాపే కుట్ర చేస్తున్నారని ఆగ్రహించారు.

ఆంధ్రా నాయకుల ఆదేశం మేరకే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఫైర్‌ అయ్యారు. హామీలు అమలు చేయలేదని ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రకటన చేశారని నిప్పులు చెరిగారు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. చార్మినార్ తొలగింపు అంటే ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నట్లేనన్నారు. వరంగల్‌ జిల్లా మంత్రులు సీతక్క, సురేఖకు ఓరుగల్లు పౌరుషం లేదంటూ చురకలు అంటించారు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhaskar).

Tags:
Next Story
Share it