Kohli : హైదరాబాద్‌లో కోహ్లీ రెస్టారెంట్.. చూస్తే వావ్ అనాల్సిందే..!

టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. హైద‌రాబాద్‌లో త‌న కొత్త బ్రాంచ్‌ను స్టార్ట్ చేశాడు.

Kohli : హైదరాబాద్‌లో కోహ్లీ రెస్టారెంట్.. చూస్తే వావ్ అనాల్సిందే..!
X

న్యూస్ లైన్, హైదరాబాద్: టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. హైద‌రాబాద్‌లో త‌న కొత్త బ్రాంచ్‌ను స్టార్ట్ చేశాడు. విరాట్‌కు ఇప్పటికే న్యూవా, వన్8 కమ్యూనీ పేరిట రెస్టారెంట్లు ప్రారంభించారు. ఇప్పటికే బెంగళూరు, ముంబై, పుణే, కోల్‌కతా, ఢిల్లీలో రెస్టారెంట్లు ప్రారంభించారు. ఇప్పుడు హైదరాబాద్ లో తన కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడు. హైటిక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్‌కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో ఈ రెస్టారెంట్ ను ప్రారంభించారు.

ఈ వన్ 8 కమ్యూన్‌లో వరల్డ్ మెనూతో పాటు 20 రకాల లోకల్ ఫుడ్ ఐటమ్స్ తో మెనూ పెట్టారు. ఈ రెస్టారెంట్‌లో ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యానీ పెట్టారు. కోహ్లీకి ఇష్టమైన మష్రూమ్ డిమ్ సమ్ కూడా అందుబాటులో ఉంది. ఈ రెస్టారెంట్ ప్రారంభానికే ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం రెస్టారెంట్ లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Tags:
Next Story
Share it