Warangal BRS MP: వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మహిళా లీడర్ !

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అన్ని

Warangal BRS MP: వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మహిళా లీడర్ !
X

Warangal BRS MP: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తున్నాయి. అయితే... కడియం శ్రీహరి రాజీనామా నేపథ్యంలో గులాబీ పార్టీ కొత్త అభ్యర్థిని ప్రకటించే పనిలో పడింది.

దళిత నియోజకవర్గం అయిన నేపథ్యంలో దళిత నేతను బరిలోకి దింపనుంది గులాబీ పార్టీ. అయితే వరంగల్ గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్నను రంగంలోకి దించేందుకు సన్నద్ధమవుతున్నారట.

గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబం కెసిఆర్ వెంట ఉన్నారు. అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబం పాల్గొంది. మొదటి నుంచి గులాబీ జెండాను పట్టుకొని నిలబడింది. అందుకే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్నకు వరంగల్ టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట.

Tags:
Next Story
Share it