Harish Rao: 21 సార్లు మైక్ కట్..

కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమంటూ సర్కారు ప్రవేశపెట్టిన తీర్మానంపై అసెంబ్లీ చర్చ.. ఆధ్యంతం వాడీవేడిగా జరిగింది.

Harish Rao: 21 సార్లు మైక్ కట్..
X

హరీష్ రావు మాట్లాడుతోంటే..

పదే పదే అడ్డుతగిలిన అధికార పార్టీ

మధ్యలో మాట్లాడిన సీఎం,డిప్యూటీ సీఎం, మంత్రులు

సర్కారు తీరుపై హరీష్ రావు ఆగ్రహం

తెలంగాణం, హైదరాబాద్ : కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమంటూ సర్కారు ప్రవేశపెట్టిన తీర్మానంపై అసెంబ్లీ చర్చ.. ఆధ్యంతం వాడీవేడిగా జరిగింది. కృష్ణా ప్రాజెక్టుల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సర్కారు... దానిపై హరీష్ రావు క్లారిఫికేషన్ ను మాత్రం అడ్డుకుంది. సర్కారు తప్పులు చెప్పిందని ఉదాహరణలతో హరీస్ రావు వివరిస్తోంటే మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే అడ్డుతగిలారు. హరీష్ రావు అలా లేచి నిలబడగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడ్డారు. కాసేపటికే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు సార్లు మధ్యలో లేచారు. అదయ్యాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రన్నింగ్ కామెంటరీ చేస్తుండటంతో.. హరీష్ రావు తన స్పీచ్ ని ఆపారు. ఇలా హరీష్ రావు మాట్లాడుతుండగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమా రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యలో లేచి మాట్లాడారు. హరీష్ రావు ఆధారాలన్నీ సభ ముందు పెడుతుండటంతో.. ఇవన్నీ కాదు.. తీర్మానానికి ఒప్పుకుంటున్నారా లేదా..? అంటూ మధ్యలో లేచి ప్రశ్నించారు. తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన.. సభలో చెప్పిన అబద్ధాలను, తప్పులను సవరించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అయినా సమయం ఇవ్వలేదు. అప్పటికే చాలా సమయం అయ్యిందని స్పీకర్ మైక్ కట్ చేశారు.

Tags:
Next Story
Share it