Congress: డీకే శివకుమార్ ను కాపీ కొడుతున్న వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గంలో వెరైటీ ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఓవైపు ఊరూరు తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

Congress: డీకే శివకుమార్ ను కాపీ కొడుతున్న వేముల వీరేశం
X

న్యూస్ లైన్, నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గంలో వెరైటీ ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఓవైపు ఊరూరు తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్ధి వేముల వీరేశం మాత్రం వెరైటీ ప్రచారం చేపట్టినట్లు తెలుస్తోంది. అదే బీర్లపై స్టికర్లు వేసి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి. ఇప్పటి వరకు అంతా డోర్ స్టికర్లతో ఇంటింటికి వెళ్లి అంటించి ప్రచారం చేయడం చూశారు. కానీ ఇదీ మరో లెవల్ అంటున్నారు జనం. తన వెంట తిరిగేవాళ్లతో పాటు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇలా బీర్లకు స్టికర్లు అంటించి మరీ ప్రచారం చేసుకుంటున్నారని అక్కడి జనం కోడై కూస్తున్నారు.

అంతే కాదు ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు వేముల వీరేశం, అతని అనుచరులు. అయితే ఆ రోడ్ షోలో వచ్చిన పబ్లిక్ ను “నీకు మందు వచ్చిందా” అంటూ చేతి సైగలతో అడిగి తెలుసుకున్నారు ఆయన అనుచరులు. ఇదీ కూడా వైరల్ గా మారింది. ”అప్పుడు సైగలు.. ఇప్పుడు బొమ్మల”తో మందుతో ప్రచారం చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ కు ఏ సమస్య ఉందో తీర్చాలే కానీ ఇలా మద్యం వచ్చిందా అంటూ.. మద్యం సీసాలపై స్టికర్లు అంటించి చిల్లర ప్రచారం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సైతం ఇలా “నీకు మందు వచ్చిందా” అంటూ చేతి సైగలతో అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో విక్టరీ కొట్టాడు. ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు డీకే శివకుమార్. ఇప్పుడు వేముల వీరేశం సైతం డీకేను కాపీ కొట్టారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఎన్నికల్లో ఇలా మద్యం పోయాల్సిందే నా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు.

Tags:
Next Story
Share it