Harish Rao: కోడంగల్ లో తంతె మల్కాజ్‌గిరిలో పడ్డావా ?

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్‌ రావు (Harish Rao). కొడంగల్‌ నియోజక వర్గంలో జనాలు తంతే... మల్కాజిగిరి

Harish Rao: కోడంగల్ లో తంతె మల్కాజ్‌గిరిలో పడ్డావా ?
X

Harish Rao: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్‌ రావు (Harish Rao). కొడంగల్‌ నియోజక వర్గంలో జనాలు తంతే... మల్కాజిగిరిలో సీఎం రేవంత్‌ రెడ్డి పడ్డాడు అంటూ చురకలు అంటించారు హరీష్‌ రావు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించం అని కాంగ్రెస్ పార్టీ ఈరోజు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడం ఇది తెలంగాణ ప్రజల, బీఆర్ఎస్ పార్టీ (BRS) విజయం అన్నారు హరీష్ రావు.

బీఆర్‌ఎస్‌ నేతలపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మేము మాట్లాడాతామని...రాహుల్ గాంధీని చెప్పుతో కొడతాం అని అనలేమా..? అంటూ చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ గురించి మాట్లాడితే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. నిన్ను కొడంగల్ నుంచి తరిమితే.. మల్కాజిగిరి వచ్చావు..? అంటూ చురకలు అంటించారు. మీ తప్పులను అధికారి మీద వేస్తున్నారని...వాస్తవాలు మాట్లాడితే అధికారి మీద నెపం మోపి తప్పించుకుంటున్నారని ఆగ్రహించారు మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao).

Tags:
Next Story
Share it