నీళ్లు అమ్ముతూ రోజుకు 50 లక్షల రూపాయల పైనే సంపాదిస్తున్న HMWS !

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో.. అప్పటినుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఎక్కడ చూసినా

నీళ్లు అమ్ముతూ రోజుకు 50 లక్షల రూపాయల పైనే సంపాదిస్తున్న HMWS !
X

Hydrabad: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో.. అప్పటినుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఎక్కడ చూసినా సమస్యలే. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఈ ఎండాకాలంలో మంచినీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఆందోళన చెందుతున్నారు హైదరాబాద్ ప్రజలు.

అయితే దీన్ని చాలా మంది క్యాష్ చేసుకుంటున్నారు. హైదరాబాద్లో నీళ్లు అమ్ముకుంటూ రోజుకు 50 లక్షల రూపాయల వరకు హెచ్ ఎమ్ డబ్ల్యూ ఎస్ డబ్బులను సంపాదిస్తుందట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి హైదరాబాద్ నగరవ వ్యాప్తంగా మంచినీటి కోసం దాదాపు పదివేల ట్యాంకర్లను సరఫరా చేస్తున్నారట. అయితే ఇందులో ఒక్కో ట్యాంకర్ కు ఒక్కో రేటు ఉంది.

గృహ అవసరాల కోసం వాటర్ ట్యాంకర్ వస్తే 500 రూపాయలు వసూలు చేస్తున్నారట. అలాగే కమర్షియల్ అవసరాల కోసం వాటర్ ట్యాంకర్ తెప్పించుకుంటే 850 రూపాయలు వసూలు చేస్తున్నారట. ఇలా విపరీతంగా హెచ్ ఎం డబ్ల్యు ఎస్ డబ్బులు సంపాదిస్తుందని చెబుతున్నారు. గతంలో గులాబీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి 20,000 మీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేసేది. కానీ ఇప్పుడు వాటర్ ట్యాంకర్లకు డబ్బులు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ ప్రజలు.

Tags:
Next Story
Share it