KTR: టెస్లా కార్ల ప్లాంట్‌..రేవంత్‌కు విజ్ఞప్తి చేసిన కేటీఆర్‌ !

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాయి కంపెనీలు. కేటీఆర్ ఐటి శాఖ మంత్రిగా ఉన్న

KTR: టెస్లా కార్ల ప్లాంట్‌..రేవంత్‌కు విజ్ఞప్తి చేసిన కేటీఆర్‌ !
X

KTR: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాయి కంపెనీలు. కేటీఆర్ ఐటి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. విపరీతంగా హైదరాబాద్ కు కంపెనీలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఐటీ శాఖను పట్టించుకునే నాధుడే లేకుండా పోయింది. అయితే తాజాగా టెస్లా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ పెట్టుబడులు ఇండియాలో పెట్టేందుకు సిద్ధమైంది.

కొత్తగా ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీని ఇండియాలో లాంచ్ చేయనుంది టెస్లా కంపెనీ. దీనికోసం ఇండియాలో ఉన్న బెస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేయాలని ఒక టీం ను పంపించిందట టెస్లా కంపెనీ యాజమాన్యం. అయితే.. ఈ అంశంపై మాజీ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు.

టెస్లా కంపెనీ హైదరాబాద్ లో పెట్టుబడులు పెడితే బాగుంటుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి.. ఆ కంపెనీ హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేలా చూసుకోవాలని సూచనలు చేశారు. పెద్ద కంపెనీ వచ్చినప్పుడు అలర్ట్ గా ఉండాలని కోరారు. మరి దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:
Next Story
Share it