Sangareddy Incident:సంగారెడ్డి జిల్లా ఎస్బీ ప్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత

సంగారెడ్డి SB ఆర్గానిక్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సంగారెడ్డి SB ఆర్గానిక్స్ కంపెనీ గేటు తీసుకుని లోపలికి వచ్చారు కార్మికులు. ఈ తరుణంలోనే

Sangareddy Incident:సంగారెడ్డి జిల్లా ఎస్బీ ప్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత
X

Sangareddy Incident: సంగారెడ్డి SB ఆర్గానిక్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సంగారెడ్డి SB ఆర్గానిక్స్ కంపెనీ గేటు తీసుకుని లోపలికి వచ్చారు కార్మికులు. ఈ తరుణంలోనే పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. అంతేకాదు...కార్మికులపై లాఠీ ఛార్జ్ కూడా చేశారు పోలీసులు.

దీంతో కంపెనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే.. కంపెనీ లోపలికి వచ్చిన కార్మికులను పోలీసులు బయటకు పంపడంతో...మెయిన్ రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు కార్మికలు. దీంతో రోడ్డుపై కార్మికులు, మృతుల కుటుంబాలు బైఠాయించాయి. ఈ తరుణంలోనే సంగారెడ్డి SB ఆర్గానిక్స్ కంపెనీ వద్ద రాకపోకలు నిలిచాయి.

ఈ సందర్భంగా మృతుడు చిదంబరం భార్య మాట్లాడుతూ.. నా భర్త 25 ఏళ్లుగా SB ఆర్గానిక్స్ లో పనిచేస్తున్నాడని... నిన్న నా భర్త జనరల్ షిఫ్ట్ లో వచ్చాడు. సాయంత్రం 5 గంటలకు పోలీసులు ఫోన్ చేసి నీ భర్త చనిపోయాడు అని చెప్పారని తెలిపారు. మృతదేహం చూద్దామని వెళ్తే హాస్పిటల్ లో అనుమతించడం లేదు. కంపెనీ వద్దకు వస్తే పట్టించుకునే వాళ్ళు లేరు. పోలీసులు తరిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు పలకరించిన వాడు లేడన్నారు.

Tags:
Next Story
Share it