Pataan cheru: నీలం మధు చెంప పగలకొడతానన్న పటాన్‌చెరు కాంగ్రెస్ ఇంఛార్జి సతీమణి !

కాంగ్రెస్ పార్టీ కి కొత్తగా శత్రువులు అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీ లోనే వర్గ పోరులు తారాస్థాయిలో ఉంటాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు సంవత్సరానికి ఒకరు మారుతూ ఉంటారు.

Pataan cheru: నీలం మధు చెంప పగలకొడతానన్న పటాన్‌చెరు కాంగ్రెస్ ఇంఛార్జి సతీమణి !
X

న్యూస్ లైన్, పఠాన్ చేరు : కాంగ్రెస్ పార్టీ కి కొత్తగా శత్రువులు అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీ లోనే వర్గ పోరులు తారాస్థాయిలో ఉంటాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు సంవత్సరానికి ఒకరు మారుతూ ఉంటారు. ఇకపోతే తెలంగాణ కాంగ్రెస్ లో కూడా వర్గ పోరు ఏ స్థాయిలో ఉంటుందో మనమంతా కళ్లారా చూసాము. రీసెంట్ గా పఠాన్ చేరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ భార్య సుధారాణి నీలం మధు గురించి చేసిన వ్యాఖ్యలు, అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. తన ఇంటికి మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన మంత్రి కొండా సురేఖ తో సుధారాణి మాట్లాడుతూ మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కి అసలు కామన్ సెన్స్ లేదని, ఆమె చెంప పగలగొట్టాలి అనుకున్నాను అంటూ సుధారాణి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో ప్రకంపనలు రేపుతోంది.

డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నీలం మధు బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసి కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమికి కారణం అయ్యింది. అలాంటి మనిషి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో చేరి మెదక్ ఎంపీ అభ్యర్థిగా నిలబడడం శ్రీనివాస్ గౌడ్ సతీమణికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయం లో ఆమె కాంగ్రెస్ అధిష్టానం పై, నీలం మధు పై తీవ్రమైన అసహనం తో ఉంది. ఆమెని శాంతపరిచేందుకే నేడు ఏకంగా మంత్రి కొండా సురేఖ ఇంటికి వచ్చి సన్మానం చేసింది. ఆమె ముందే ఈమె తన అసంతృప్తిని తెలపడం చూస్తుంటే సుధారాణి కి అవకాశం ఉంటే నిజంగానే నీలం మధు చెంప పగలగొట్టే విధంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు విలువలతో కూడిన రాజీయాలు చెయ్యడం లేదని క్యాడర్ లో కూడా చెడ్డ పేరు బాగా వచ్చేసింది.


Tags:
Next Story
Share it