KRMB: కృష్ణా బోర్డు మీటింగ్‌కు తెలంగాణ అధికారులు డుమ్మా !

ఇవాళ జల సౌదలో కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిమెన్ కమిటీ సమావేశం ఇవాళ జరుగుతోంది. ఈ తరుణంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసింది కృష్ణా రివర్ మేనేజ్మెంట్

KRMB: కృష్ణా బోర్డు మీటింగ్‌కు తెలంగాణ అధికారులు డుమ్మా !
X

KRMB: ఇవాళ జల సౌదలో కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిమెన్ కమిటీ సమావేశం ఇవాళ జరుగుతోంది. ఈ తరుణంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసింది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ). ఏపీకి సాగర్ నుంచి 5 టీఎంసీలను విడుదల చేయాలని కోరుతున్నారు ఏపీ అధికారులు. అయితే.. ఈ అంశాలపై తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు అవసరాలకు తాగునీటిపై చర్చించేందుకు ఇవాళ జల సౌదలో కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిమెన్ కమిటీ సమావేశం నిర్వహించాలని అనుకున్నారు.

అయితే... ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) మీటింగ్‌కు తెలంగాణ అధికారులు డుమ్మా కొట్టారు. నీటి వాటాల కేటాయింపుపై జరిగిన మీటింగ్‌కు హాజరు కాలేదు తెలంగాణ అధికారులు. అటు ఈ రోజు సమావేశాన్ని 8వ తేదీకి వాయిదా వేయాలని బోర్డును కోరారట ఏపీ అధికారులు. నాగార్జున సాగర్ నుంచి నీటిని వినియోగించుకోకుండా తెలంగాణను నిలవరించాలని బోర్డుకు లేఖ రాసింది ఏపీ సర్కార్‌. ఇలాంటి ముఖ్యమైన సమాశానికి తెలంగాణ అధికారులు డుమ్మా కొట్టారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it