Dasara Lottery: దసరా లాటరీ ప్రకటించిన చికెన్ షాపు..ముక్క ..చుక్కే గిఫ్ట్ లు ?

అన్ని రంగాల్లోను పోటీ నెలకొంది. చికెన్ షాపుల్లో కూడా ..ఎవరి వ్యాపారం వారిది కదా...అందుకే విభిన్నమైన ఆలోచనలతో తమ వ్యాపారాన్ని పెంచుకునే ఆలోచనలు చేస్తున్నారు.


Published Sep 27, 2024 01:12:00 PM
postImages/2024-09-27/1727423109_dcCover9cmu24bksvcsg47u9d5768nbk020231015223008.Medi.jpeg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : దసరా వచ్చిందంటే చాలు తెలంగాణ , ఆంధ్రా ఇలా ప్రతి ప్రాంతంలోను నవరాత్రుల సందడి మొదలవుతుంది. బోనాల పండుగ తో తెలంగాణ అన్ని మూలల పండుగ వాతావారణం నెలకొంటుంది. పల్లె నుంచి పట్నం వరకు కూడా చుక్క, బొక్కా లేకుండా ఉండలేరు. అయితే అన్ని రంగాల్లోను పోటీ నెలకొంది. చికెన్ షాపుల్లో కూడా ..ఎవరి వ్యాపారం వారిది కదా...అందుకే విభిన్నమైన ఆలోచనలతో తమ వ్యాపారాన్ని పెంచుకునే ఆలోచనలు చేస్తున్నారు.


కొమరం భీం జిల్లా లోని ఆసిఫా బాద్ లో సిధ్ధు చికెన్ సెంటర్  యజమాని దసరా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక్కో టికెట్ రూ.50 మాత్రమే.. ఇది చూసి అందరూ.. టికెట్ల కోసం ఎగబడుతున్నారు. జనాలు ఎక్కువ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క టికెట్ మాత్రమే కొనుగోలు చెయ్యాలని షాపు ఓనర్ చెబుతున్నారు.


అయితే అక్టోబర్ 10వ తేదీ న తియ్యబోతున్న ఈ మెగా లక్కీ డ్రాలో గిఫ్ట్‌లు యమ క్రేజీగా ఉన్నాయి.  గొర్రె, మేక, మద్యం సీసా.. కోడిపుంజు.. ఇలా మసాలా.. మద్యాన్ని ఓనర్ దట్టించేశారు. ఈ లక్కిడ్రాలో ఫస్ట్ ఫ్రైజ్ గొర్రె పొట్టెలు, సెకండ్ ఫ్రైజ్ 100 పైపర్స్ మద్యం , థర్డ్ ప్రైజ్  కోడి పుంజు, ఫిప్త్ ఫ్రైజ్ నాటు కోడి ఇస్తామని పోస్టర్‌లో ప్రకటించారు.  అంతేకాదు 10 వ తారీఖున లక్కీ డ్రా కూడా తీస్తున్నారట. గెలిచినవారికి ఈ దసరా విందే మరి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news chicken dasara

Related Articles