ఈ విచిత్ర ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఓ బ్యాంక్ మేనేజర్‌కు నాటు కోడి కూర అంటే మహా ఇష్టం. చక్కగా కొనుక్కు తింటే ఏ గోల లేదు. కాని తనకి ఫ్రీ గా డబ్బులు లేకుండా కావాలి. దానికి తన పదవిని అడ్డుపెట్టుకున్నాడు. వృత్తి రీత్యా బ్యాంకు మేనేజర్ కావడంతో ఓ మంచి కోళ్ల ఫాం ఉన్న రైతును చూసి లోన్ ఇస్తామంటు నమ్మించాడు. కావాల్సినప్పుడల్లా నాటు కోళ్లు తెప్పించుకు తిన్నాడు. తీరా లోన్ గురించి అడగ్గా ప్లేట్ తిప్పేశాడు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విచిత్ర ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆ రైతు పేరు రూపచంద్ మన్హర్‌కు కోళ్ల ఫారమ్ ఉంది. తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావించిన రైతు స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌ను కలిసి, రూ.12 లక్షల లోన్ అడిగాడు. . లోన్ వస్తదన్న ఆశతో మన్హర్ బ్యాంకు మేనేజర్‌కి రోజూ నాటు కోడి తెచ్చి ఇచ్చేవాడు. అలా మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు మేనేజర్ తినేశాడు. పైగా లోన్ అమౌంట్ లో 10 శాతం కమిషన్ కూడా ముందే ఇచ్చేశాడు. అన్ని అయ్యాక లోన్ అడిగితే రిప్లై లేకపోయే సరికి రైతుకు క్లారిటీ వచ్చింది. నిందితుడిపై చర్యలు తీసుకోకపోతే తాను ఎస్‌బీఐ బ్రాంచ్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మేనేజర్‌కు ఇచ్చిన కోళ్ల తాలూకు బిల్లులు కూడా పోలీసులకు చూపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.