అత్త పాత్రలకి హీరోయిజాన్ని తీసుకొచ్చిన నట శిఖామణి సూర్యకాంతం నేడు భౌతికంగా మన మధ్య లేక పోయినా తను నటించిన సినిమాల ద్వారా మన ముందే ఉన్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలుగు సినిమా వైభవంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో సూర్యకాంతం ఒకరు. నేడు తన పుట్టిన రోజు. ఈ రోజుతో సూర్యకాంతం శతజయంతి ఈ ఏడాది జరుగుతుంది. అత్త పాత్రలకి హీరోయిజాన్ని తీసుకొచ్చిన నట శిఖామణి సూర్యకాంతం నేడు భౌతికంగా మన మధ్య లేక పోయినా తను నటించిన సినిమాల ద్వారా మన ముందే ఉన్నారు.
1924 అక్టోబర్ 28 న కాకినాడలో ఒక సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబంలో సూర్యకాంతం జన్మించారు. మొదట డాన్సర్ గా పర్లాకిమిడి జమిందారు రాజా గజపతిదేవ్ నిర్మాతగా సి. పులయ్య దర్శకత్వం లో వచ్చిన నారద నారది సినిమాలో నటించారు. మూగ అమ్మాయి పాత్రలో నటించింది.
ఆ తర్వాత పెళ్లి చేసి చూడు, ప్రేమ, అమ్మలక్కలు, దొంగ రాముడు, చంద్రహాసన్ కన్యాశుల్కం, అప్పుచేసి పప్పుకూడు, తోడికోడళ్లు ,మాయాబజార్మాం,మాంగల్యబలం ఇలా దాదాపు 30 సినిమాలకి పైనే నటించి మంచి నటీమణి అనే గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇక అక్కడ మొదలైంది గుండమ్మకథ సినిమా . సూర్యకాంతం కి పిచ్చ క్రేజ్ వచ్చేసింది. అయితే తెలుగు సినిమాలో సువర్నాక్షరాలతో రాసుకుంది. ఒకటే పాత్ర వందల సినిమాల్లో నటించారు. అంత సూపర్ హిట్ అయ్యింది.తమ అత్తలని చూసి భయపడడం మొదలుపెట్టారు. తను ఆ పాత్రలో ఎంత ఒదిగిపోయిందంటే ఇప్పటికి ఆవిడ పేరు తలుచుకొని తిట్టుకుంటారు. నిజానికి ఇదంతా ఆ పాత్రలో ఆమె చేసిన నటనే అయిన గయ్యాళి గుండమ్మ గుర్తుండిపోయింది.70 సంవత్సరాల వయసులో 1994 డిసెంబర్ 18 న సూర్యకాంతం కన్నుమూశారు. నేటి తో గుండక్కకు శతజయంతి ..తన సినిమాలు మరో శతజయంతి జరుపుకుంటాయి. తన మాటలు మరో వందేళ్లు బతికేఉంటాయని ఆశిద్దాం.