kerala: సముద్రంలో పడిపోయిన ఐఫోన్ ను ..ఏడు గంటలు వెతికిన మేనేజ్మెంట్

కొత్త ఐఫోన్ ను సముద్రంలో పొగొట్టుకుంది. సముద్రంలో పోతే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి.. కాని టూరిస్ట్ ప్యాకేజీ లో వచ్చింది.

kerala: సముద్రంలో పడిపోయిన ఐఫోన్ ను ..ఏడు గంటలు వెతికిన మేనేజ్మెంట్
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కేరళ ( kerala) ట్రిప్ కు వెళ్లిన ఓ మహిళ పాపం తన కొత్త ఐఫోన్ ను సముద్రంలో పొగొట్టుకుంది. సముద్రంలో పోతే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి.. కాని టూరిస్ట్ ప్యాకేజీ లో వచ్చింది కదా చచ్చినట్లు నా ఫోన్ తీసుకురావాల్సిందేనని పట్టుబట్టుకు కూర్చుంది.ఆ ఫోన్ కోసం ఏకంగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని హోటల్ మేనేజ్ మెంట్ రంగంలోకి దించింది. ఏడు గంటల పాటు సముద్రంలో గాలించిన ఆ టీమ్.. ఎట్టకేలకు ఫోన్ ను వెతికి బయటకు తీసుకొచ్చింది. ఈ రెస్క్యూ వీడియోను హోటల్ యాజమాన్యం ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. ఫుల్ వైరల్ అయ్యింది.

కర్ణాటకకు( karanataka) చెందిన ఓ మహిళ కేరళ టూరుకెళ్లింది. ఈ టూర్ లో భాగంగా అంటీలియా షాలెట్స్ అనే రిసార్ట్ లో బస చేసింది. సరదాగా సముద్ర తీరంలోని కొండ రాళ్లపై ఫొటోలు దిగుతుండగా ఫోన్ జారి నీళ్లలో పడిపోయింది. 1.5 లక్షల రూపాయల విలువైన ఐఫోన్ కావడంతో చాలాసేపు వెతికి నిరాశతో హోటల్ కు చేరుకుంది. రిసార్ట్( resort) మేనేజ్మెంట్ కు విషయం చెప్పడంతో.. రిసార్ట్ కు చెందిన స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. డబ్బుంటే ఎవ్వరి టైం ఎంతైనా వెయిట్ చెయ్యొచ్చంటు కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

Tags:
Next Story
Share it