నా పర్మిషన్ లేకుండా కంటారా..పేరెంట్స్ పై కేసు వేసిన కూతురు..!

ఈ ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు. వీరంతా ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికి తెలియదు. ఎవరికి నచ్చినట్టు వారు జీవిస్తూ ఉంటారు. అలాంటి ఈ తరుణంలో కొంతమంది వ్యక్తులు

నా పర్మిషన్ లేకుండా కంటారా..పేరెంట్స్ పై కేసు వేసిన కూతురు..!
X

న్యూస్ లైన్ డెస్క్:ఈ ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు. వీరంతా ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికి తెలియదు. ఎవరికి నచ్చినట్టు వారు జీవిస్తూ ఉంటారు. అలాంటి ఈ తరుణంలో కొంతమంది వ్యక్తులు అసలు ఈ సమాజం ఊహించని విధంగా కొన్ని కొన్ని పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఆ విధంగానే ఈ అమ్మాయి కూడా తల్లిదండ్రులపై కేసు వేసి అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. తల్లిదండ్రులపై కేసు వేస్తే ఆశ్చర్యం ఏముంది అని మీరు అనుకుంటున్నారు కదూ..

కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆమె తల్లిదండ్రులపై కేసు వేసింది తనను కన్నందుకే.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. న్యూ జెర్సీకి చెందిన "కాస్ట్ యాజ్" అనే యువతి తన తల్లిదండ్రులు తన అనుమతి లేకుండా జన్మనిచ్చారని, తన తల్లిదండ్రులపై కేసు పెట్టిందట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి కూడా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిందట. ప్రస్తుతం నేను తల్లయ్యాను, ఓ ప్రదేశంలో ఉన్నాను.

ఇక్కడ ఉండడానికి కారణం నా తల్లిదండ్రులే. నేను ఇక్కడ ఆనందంగా ఉన్నానా, ఇబ్బందులు పడుతున్నానా అని వారు చూడడం లేదు. వారు కనే ముందు అసలు నాకు ఈ భూమ్మీదికి రావడం ఇష్టమా లేదా అని తెలుసుకోకుండా కన్నారు అంటూ టిక్ టాక్ వేదికగా ఒక వీడియోను ఆమె రిలీజ్ చేసిందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపై నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Tags:
Next Story
Share it