viral: చాక్లెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూసే ...‘డెయిరీ మిల్క్’లో పురుగులు

డైరీ మిల్క్ చాక్లెట్ లో పురుగులు రావడంపై అందోళన చెందుతున్న కస్టమర్లు.

viral: చాక్లెట్ లవర్స్ కు బ్యాడ్ న్యూసే ...‘డెయిరీ మిల్క్’లో పురుగులు
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: చాక్లెట్స్( choclate) పిల్లలకే కాదు ఆడపిల్లలకు కూడా చాలా ఇష్టం. అకేషన్ ఏదైనా చాక్లెట్స్ తింటూ ఉంటారు. కాని చాక్లెట్ లవర్స్ కు మాత్రం ఇప్పుడు చూపించే సీన్ చూస్తే గుండె ఆగిపోతుంది. మీరు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్స్ లో ఏమున్నాయో ఈ వీడియోలో మీరే చూసేయండి.

డెయిరీ మిల్క్ చాక్లెట్లో( milk choclate) తెల్లని పురుగులు రావడంతో కస్టమర్లు షాకయ్యారు. హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్‌లో ఈ సీన్ జరిగింది. ఆ చాక్లెట్ కొన్న కస్టమర్ ఈ వీడియోలు , ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు . ఆ పురుగు కూడా చాక్లెట్ కలర్ లోకి మారడం చాల విచిత్రంగా ఉందన అంటున్నారు.

అమర్‌పేట్( ammerpet) మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేశానని, దీనికి సంబంధించిన బిల్లును కూడా జత చేశానని పేర్కొన్నారు. డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగులు ఉండటంపై క్యాడ్‌బరీ.. సూపర్ మార్కెట్ నిర్వాహకులను ప్రశ్నించారు కస్టమర్లు . కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తామని తెలిపారు. గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ కార్పొరేషన్, క్యాడ్‌బరీ మిల్క్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ను ట్యాగ్ చేశాడు. తాను కొనుగోలు చేసిన బిల్లును కూడా ఈ పోస్టుకు జతచేశారు. ప్రేమికుల దినోత్సవంలో ఎక్కువగా సేల్ అయ్యేవి చాక్లెట్సే. కాని ఈ సీన్ చూశాక జనాలు ఎలా రియాక్ట్ అవుతారో అంటున్నారు నెటిజన్లు.


Tags:
Next Story
Share it