ECO FRIENDLY WEDDING: ఎకో ఫ్రెండ్లీ పెళ్లిని చూసేద్దాం రండి

తాటాకులు పందిళ్లు, ముంగిట్లో ముగ్గులు, పెళ్లి పందిర్లో అయితే చిన్న ముక్క ప్లాస్టిక్ లేకుండా చక్కగా పూలతో జీరో వేస్ట్ లేకుండా డెకరేట్ చేశారు

ECO FRIENDLY WEDDING: ఎకో ఫ్రెండ్లీ పెళ్లిని చూసేద్దాం రండి
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అసలు పెళ్లి అంటే ఓ 20,30 యేళ్ల కిందట పెళ్లిళ్లు బెస్ట్ . నో టెన్షన్...బఫే భోజనాలు లేవు...వాళ్లు పెట్టారు వీళ్లు పెట్టారని ...పోటీ భోజనాలు లేవు. ముఖ్యంగా బహిరంగ మంగళస్నానాలు లేవు.. బరాత్ పేరుతో ..పిచ్చిపిచ్చి డాన్సులు లేవు..ప్రీ వెడ్డింగ్ షూట్స్ లేవు. అసలు ఇవేం లేవంటే పెళ్లి ఎంత నేచురల్ గా జరిగేదే చూడండి.

సేమ్ టు సేమ్ అలాంటి నేచురల్ వెడ్డింగ్... సోషల్ మీడియాలో( SOCIAL MEDIA) ఫుల్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం పెళ్లిళ్లకు డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. కొంతమంది డెస్టినేషన్ వెడ్డింగ్‌కు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే, మరికొందరు గ్రాండ్ వెడ్డింగ్( GRAND WEDDING) అని చెప్పి కష్టపడి సంబంధించిన మొత్తం డబ్బును వృధా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక జంట సింపుల్ గా పెళ్లి చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

తాటాకులు పందిళ్లు, ముంగిట్లో ముగ్గులు, పెళ్లి పందిర్లో అయితే చిన్న ముక్క ప్లాస్టిక్ లేకుండా చక్కగా పూలతో జీరో వేస్ట్ లేకుండా డెకరేట్ చేశారు. అరిటాకు భోజనాలు చాలా అందంగా చేసుకున్నారు. ఇక్కడ చెరకు గెడలు, చెరకు, కొబ్బరి ఆకులతో కల్యాణ మండపాన్ని నిర్మించారు. ఈ చెరకును పశువులకు మేతగా వేస్తారు. అదేవిధంగా కొబ్బరి ఆకులను ఉపయోగించి పందిరిని నిర్మించారు. ఆహారం కోసం అరటి ఆకులను ఉపయోగించారు. అతిథులకు రిటర్న్ బహుమతిగా జూట్ బ్యాగ్ అందించారు. ఆడంబరమైన పెళ్లిళ్ల మధ్య జరిగిన ఈ జీరో వేస్ట్ పెళ్లి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. దాదాపు పాతకాలం పెళ్లిలా చూడ చక్కగా ఉందంటున్నారు నెటిజన్లు.



Tags:
Next Story
Share it