నాన్న ఆవేదన.. తండ్రి ఇష్టముండే ప్రతి ఒక్కరూ చదవాల్సిందే.!

నాన్న..ఈ పదం వెనుక ఎంతో ప్రేమ దాగి ఉంటుంది. ఆ ప్రేమను వెలకట్టలేం,వర్ణించలేం. ఒక పల్లెటూరులో నాన్న ఒక అమ్మ.. వారికి ముగ్గురు కొడుకులు. పిల్లల్ని బాగా చదివించారు,

నాన్న ఆవేదన.. తండ్రి ఇష్టముండే ప్రతి ఒక్కరూ చదవాల్సిందే.!
X

న్యూస్ లైన్ డెస్క్: నాన్న..ఈ పదం వెనుక ఎంతో ప్రేమ దాగి ఉంటుంది. ఆ ప్రేమను వెలకట్టలేం,వర్ణించలేం. ఒక పల్లెటూరులో నాన్న ఒక అమ్మ.. వారికి ముగ్గురు కొడుకులు. పిల్లల్ని బాగా చదివించారు, ఉద్యోగాలు రాగానే పెళ్లిళ్లు కూడా చేసేసారు. ముగ్గురు కొడుకులు తలో దిక్కు సెటిల్ అయిపోయారు. నాన్న ముసలి ఏజ్ కు వచ్చాడు. సడన్ గా అమ్మ చనిపోయింది. అంతసేపు ఆనందంగా గడిపిన నాన్న కుదేలైయిపోయాడు.

అలా కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఇంట్లో ఉంటున్నాడు. కానీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కొడుకులు కోడండ్లు వచ్చి సొంత ఊరిలో తండ్రితో కొన్నాళ్లు గడపలేకపోతున్నారు. చివరికి కొడుకులు గొడవలు పెట్టుకుని తలా ఒక నెల నాన్నను వంతులుగా ఉంచుకోవడం మొదలుపెట్టారు.. నాన్నకు ఒక్కో కొడుకు దగ్గర ఒక్కో విధమైనటువంటి పరిస్థితి.. అయినా అన్ని బాధలను దిగమింగుకొని అంతా తనవాళ్లే అనుకుంటూ బతుకుతున్నాడు. కానీ చిన్న కొడుకు కోడలు దగ్గరికి వెళ్లడానికి చాలా ఇష్టపడతాడు. ఎంతలా అంటే పిల్లాడు హాస్టల్ నుంచి సొంత ఇంటికి వచ్చేటప్పుడు ఎంత సంబరపడతాడో ఆ విధంగా చిన్న కొడుకు కోడలు ఇంటికి వెళ్లేటప్పుడు అంతా సంబరపడతాడు..ఎందుకో ఇప్పుడు చూద్దాం..

నాన్న ఇంకా నాలుగు రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి. ముడతలు పడ్డ తన వేళ్ళతో రోజులను లెక్కిస్తున్నాడు. పోయిన దీపావళికి రెండవ కొడుకు ఇంటికి వెళితే పంచెలు కొనిచ్చాడు. అది బాగా ముడతలు పడిపోయాయి. అంతకుముందు పెద్దకొడుకు కొనిచ్చిన కళ్ళజోడు కూడా పగిలిపోయింది. ఈ విషయం కొడుక్కి చెబితే కోపానికి వస్తాడు. కోడలితో చెబితే అరుస్తుంది అని చెప్పలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టలేను అని మనసులో అనుకుంటున్నాడు. కొన్ని రోజుల్లో చిన్న కోడలు ఇంటికి వెళ్తే ఎంచక్కా అద్దాలు మార్చుకోవచ్చు. ఇంకా కొద్దిరోజులే టైం ఉంది ఆ పంచెలు ఉతుక్కోవాలి, నల్లగా ఉంటే చిన్న కోడలు కోప్పడుతుంది. ఆ నాలుగు రోజులు ఇట్టే గడిచిపోయాయి.

రెండవ కొడుకు చిన్న కొడుకు వద్దకు వెళ్లడానికి బస్సు ఎక్కించాడు. బస్సు దిగగానే నా చిన్న కోడలు స్కూటీతో వచ్చి రెడీగా ఉంది. నన్ను చూడగానే అద్దాలు ఏమయ్యాయి మామయ్య అని అడిగింది. బ్యాగులో ఉన్నాయని చెప్పా. తీసుకొని పెట్టుకోండి. పగిలిపోయాయని చెప్పాను. కోపంగా తన వంక చూసింది తలవంచుకున్నాను. నేరుగా అద్దాల షాప్ కు తీసుకెళ్లి కొత్త కళ్ళజోడు కొనిచ్చింది. ఆ తర్వాత ఇంటికి వచ్చాం. కుర్చీ మీద కూర్చున్నాను. నా వైపు అలా చూసింది మామయ్య ఏంటి బట్టలు మురికిగా ఉన్నాయి, నీ బట్టలు నువ్వే ఉతుక్కుంటున్నావు కదూ అని ప్రశ్నించింది. లేదమ్మా వాషింగ్ మిషన్ లో వేస్తారు అని చెప్పాడు. అందుకే మామయ్య నువ్వు ఇక్కడే ఉండమంటే ఉండవు, కనీసం నీకు బట్టలు, అద్దాలు కొనివ్వలేనంత బిజీగా ఉన్నారా నీ కొడుకులు అని ప్రశ్నించింది.

ఆ ముసలి తండ్రి తల కిందికి వేసుకున్నాడు. పోనీలే అమ్మా ఎవరిని ఏమనకు అని అన్నాడు మామయ్య.. వెంటనే మామయ్యకు ఇష్టమైన బాదం జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది.. నా బ్యాగులోంచి బట్టలన్నీ తీసింది. నిజం చెప్పండి మామయ్య, మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా అని అడిగింది. మీరు అన్ని అబద్ధాలే చెబుతున్నారు అంటూ ప్రశ్నించింది. ఎందుకు మామయ్య మీ చిన్న కొడుకు నేను ఇక్కడే ఉంటే చూసుకోలేమా అని అడిగింది. వెంటనే నా కళ్ళల్లో కన్నీరు ఉబికి వచ్చింది. కోడలు రెండు చేతులు పట్టుకొని గద్గల స్వరంతో ఏడ్చాడు. నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తానమ్మా ,నీకు మరో జన్మలో బిడ్డనై పుట్టాలని ఉంది తల్లి..

ప్రేమగా నన్ను చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగతా నెలలన్నీ గుర్తు చేసుకుంటానమ్మ అంటూ గట్టిగా ఏడ్చాడు. వెంటనే నా కోడలు కూడా కన్నీరు పెట్టుకుంటూ ప్రేమతో ఓదార్చింది. మామయ్య ఇప్పటినుంచి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు అంటూ గట్టిగా మందలించింది. అంటే ప్రస్తుత కాలంలో చాలామంది కొడుకులు కోడళ్ళు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ, ఇబ్బందులు పెడుతున్నారు. అయినా ఆ ముసలి మనసులు అన్ని భరించుకుంటూ అంతా నా వల్లే కదా అనుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులను అస్సలు నెగ్లెట్ చేయకండి. మీకు ఉన్నంతలో హ్యాపీగా చూసుకోండి. మీరు కూడా ఆ పొజిషన్ కు వెళ్తారనేది గమనించండి. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

Tags:
Next Story
Share it