Hungry Elephant Video: ఏనుగుకి ఆకలి వేస్తే ..తగ్గేదేలే

ఏనుగైనా( ELEPHANT)..మనిషైనా ఆకలి కంట్రోల్ చెయ్యడం చాలా కష్టం. పాపం ఓ ఏనుగు ఇలానే ఆకలి అని చెప్పలేక..ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో వెతుక్కోలేక ఫుల్ గోల గోల చేసింది

Hungry Elephant Video: ఏనుగుకి ఆకలి వేస్తే ..తగ్గేదేలే
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏనుగైనా( ELEPHANT)..మనిషైనా ఆకలి కంట్రోల్ చెయ్యడం చాలా కష్టం. కొందరు కంట్రోల్ చేసుకోగలరు..మరి కొంతమందికి మాత్రం ఛాన్సే లేదు. పాపం ఓ ఏనుగు ఇలానే ఆకలి అని చెప్పలేక..ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో వెతుక్కోలేక ఫుల్ గోల గోల చేసింది. పంట పొలాలు ...జనావాసాలు అన్నీ చిందరవందర చేసి పడేసింది.

ఏనుగులు వేల కిలోల బరువును కలిగి ఉంటాయి. గజరాజు ( GAJA RAJU) తమ పాదాల కింద పడ్డది ఏదైనా సరే.. చూర్ణం చేయగలవు. దానికి ఆగ్రహం వస్తే చుట్టూ అంతా నాశనం చేయగలవు. ఏనుగుకు ఆకలి వేసింది, ఆ తర్వాత ఏనుగు ఆహారంతో ఏనుగు చేసిన పని చూస్తే ఫుల్ షాక్ అవుతారు.

ఏదో ఒక ఫ్యాక్టరీ గోదాం( FACTORY GODAM) కి వచ్చింది.. అక్కడే కొందరు యువకులు అప్పటికే ఏనుగును తరిమికొట్టే ప్రయత్నం చేశారు. వారి భయం వారిది. ఎక్కడ తొండంతో కృష్ణాష్టమి ఉట్టి కొట్టినట్లు కొట్టేస్తుందేమో అని ..కానీ, అవేవీ లెక్కచేయని ఏనుగు నేరుగా ఒక గోడౌన్‌ షెట్టర్‌ వద్దకు వెళ్లింది.. బలంగా తన తొండంతో ఆ షెట్టర్‌ను( SHETTER) తునా తునకలు చేసేసింది. లోపల ఉన్న ధాన్యం బస్తాల్లోంచి ఓ మూటను లాక్కుని వచ్చేసింది. ఏనుగు తన కాళ్లతో ఆ మూటను పగలగొట్టుకుని అందులో ఉన్న పదార్థాన్ని తిని కడుపు నింపుకునే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో చుట్టూ ఉన్న జనం ఏనుగును తరిమి కొడుతూ కనిపించారు.

పాపం ఏనుగు తినే పండ్లు ..తియ్యని చెరుకు( SUGER CANE) లాంటివి కాకపోయినా పాపం..ఆకలితో వెళ్లి ఎడా పెడా షట్టర్ ను చితక్కొట్టేసి దానికి కావాల్సిన ఫుడ్ తెచ్చుకుంది. కాని భీభత్సం మాత్రం గట్టిగానే చేసేసింది.


Tags:
Next Story
Share it