ప్రేతాత్మల పెళ్లి చూద్దాం రారండి..!

మన భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా,

ప్రేతాత్మల పెళ్లి చూద్దాం రారండి..!
X

న్యూస్ లైన్ డెస్క్: మన భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఈ ఆచారాలు మాత్రం తగ్గట్లేదు. ఆ విధంగానే కర్ణాటకలో కూడా ఒక వింత ఆచారం ఉంది. ప్రేతాత్మలకు పెళ్లి చేసే ఆచారం. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. కర్ణాటక చెందిన తల్లిదండ్రులు ఒక పత్రిక ప్రకటన ఇచ్చారు. 30 సంవత్సరాలు క్రితం మరణించిన తన కుమార్తెకు వరుడు కావాలని వారు ప్రకటన ఇచ్చారు.

కర్ణాటక రాష్ట్రంలోని ఉట్టూరు ప్రాంతానికి చెందిన ఓ జంట ఈ ప్రకటనలో వధువు కులం, గోత్రం, జన్మ నక్షత్రాలను తెలుపుతూ ప్రకటన ఇచ్చారు. ఇక దీనికి తగ్గట్టు వరుడు కావాలని వారు ప్రకటనలో తెలియజేశారు. ఆ వధువు 30 సంవత్సరాల క్రితం మరణించింది. అలాగే 30 సంవత్సరాల క్రింద మరణించిన ఇదే కులం వేరొక గోత్రం కలిగినటువంటి వరుడు ఉన్నట్లయితే "ప్రేతముడివే" కార్యక్రమం నిర్వహించడానికి వరుడి కుటుంబ సభ్యులు కావాలని వారు ప్రకటన అందించారు.

కర్ణాటకలోని దక్షిణ ఉడిపి జిల్లా తులనాడు ప్రాంతంలో మరణించిన వారి ఆత్మలకు వివాహం చేసే ఆచారం పూర్వకాలం నుంచి కొనసాగుతోంది. బ్రతికున్న వారికి వివాహం చేసినట్టుగానే ప్రేతాత్మలకు కూడా వివాహం ఘనంగా నిర్వహిస్తారు. అయితే వీరు పేపర్ ప్రకటన ఇస్తే దీనిపై 50 మంది పైగా స్పందించారట. త్వరలోనే వీరు "ప్రేతమడువె" కార్యక్రమం నిర్వహిస్తామని దానికి సంబంధించిన తేదీని కూడా బయట పెడతామని తెలియజేశారు. దీనికి సంబంధించిన వార్త దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది.

Next Story
Share it