Trafic police : హెల్మెట్ పెట్టుకోమ్మనందుకు వేలు కోరికిన వాహనదారుడు

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు ఫైన్ వేస్తారు. లేదంటే జరిమానా విధిస్తారు. ఇంకా ఎక్కువ అయితే... కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతారు.

Trafic police : హెల్మెట్ పెట్టుకోమ్మనందుకు వేలు కోరికిన వాహనదారుడు
X

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు ఫైన్ వేస్తారు. లేదంటే జరిమానా విధిస్తారు. ఇంకా ఎక్కువ అయితే... కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతారు. ఇదంతా ఒకప్పుడు.. కానీ ఇప్పుడు మాత్రం ట్రాఫిక్ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు వాహనదారులు. హెల్మెట్ ధరించకుండా, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. హెల్మెట్ ధరించికుండా, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ అమర్యాదగా పెట్టుకో అన్నందుకే ఏకంగా వేలునే కొరికిశాడు. ఈ ఘటన బెంగళూరులో తాజాగా చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బెంగుళూరులో విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ సమీపంలో హెల్మెట్ లేకుండా స్కూటీని నడుపుతూ పట్టుబడ్డాడు. వాహనదారుడి అయిన సయ్యద్ సఫీని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. హెల్మెట్ ధరించికుండా ఇష్టానుసారంగా సమాధానం ఇవ్వడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ స్కూటీ ఆపారు. ఓ కానిస్టేబుల్ స్కూటీ తాళం తీశాడు. మరో హెడ్ కానిస్టేబుల్ ఈ సన్నివేశాన్ని సిద్ధరామేశ్వర రికార్డ్ చేయడానికి సంఘటనను చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. 28 ఏళ్ల యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుళ్లిద్దరినీ ఎదురించాడు. ఓ దశలో దళాలు తీసేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలిని కొరికాడు.

తాను ఆసుపత్రికి వెళ్తుండగా హెల్మెట్ ధరించడం మర్చిపోయానని చెప్పినట్టు ఆ వీడియోలో ఉంది. తన వీడియో వైరల్ గా మారితే పట్టించుకోనని చెప్పడం మరి విడ్డూరంగా ఉంది. దీంతో సయ్యద్ సఫీ హెడ్ కానిస్టేబుల్ ఫోన్ ను లాక్కొని, వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించి అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని దుర్భాషలాడడం, నేరపూరిత బెదిరింపులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Tags:
Next Story
Share it