Viral News: రైలు టికెట్లు కొంటారు కానీ ప్రయాణం చేయరు.!

మనం రైలులో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా టికెట్ కొనాలి. టికెట్ ఉంటేనే రైలు ఎక్కి ప్రయాణం చేయగలుగుతాం. ఒకవేళ టికెట్ తీసుకోకుంటే రైల్వే టీసీకి దొరికితే ఫైన్ వేస్తారు.

Viral News: రైలు టికెట్లు కొంటారు కానీ ప్రయాణం చేయరు.!
X

న్యూస్ లైన్ డెస్క్: మనం రైలులో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా టికెట్ కొనాలి. టికెట్ ఉంటేనే రైలు ఎక్కి ప్రయాణం చేయగలుగుతాం. ఒకవేళ టికెట్ తీసుకోకుంటే రైల్వే టీసీకి దొరికితే ఫైన్ వేస్తారు. అలాంటి ఈ తరుణంలో తప్పనిసరిగా చాలామంది టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తారు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం టికెట్లు కొంటారు కానీ రైల్లో మాత్రం ప్రయాణం చేయరు. అవునండి మీరు విన్నది నిజమే. టికెట్ కొనడం వరకే వారి వంతు ప్రయాణం మాత్రం అస్సలు చేయరట. వీరికి ఏమైనా పిచ్చా, డబ్బులు ఎక్కువగా ఉన్నాయా అని మీరు అనుకుంటున్నారు కదూ.. అది ఏది కాదు వారి రైల్వే స్టేషన్ ను వారు కాపాడుకోవాలని ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం, దీంతో ఆ మండలంకు చెందిన ప్రజలు ప్రతిరోజు 60 టికెట్లు కొనుగోలు చేసి స్టేషన్ హాల్టింగును కాపాడుకుంటున్నారట.

పూర్తి వివరాల్లోకి వెళితే .. వరంగల్ జిల్లాలోని నెక్కొండ రైల్వే స్టేషన్ లో ఈ వినూత్న ఘటన జరుగుతోంది. నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఏకైక స్టేషన్ నెక్కొండ రైల్వే స్టేషన్. వివిధ మండలాలకు చెందిన వారంతా ఇక్కడికే వస్తూ ఉంటారు. స్టేషన్ ఉందంటే తప్పనిసరిగా రైలు హాల్టింగ్ ఉంటుంది. ఇక్కడ రైలు హాల్టింగ్ ను నిలిపివేశారట రైల్వే అధికారులు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేసి రైళ్ల హాల్టింగ్ కోసం ప్రతిరోజు 60 టికెట్లను కొనుగోలు చేస్తున్నారట, అయితే ఈ స్టేషన్ గుండా హైదరాబాద్, ఢిల్లీ, తిరుపతి, షిరిడి, వంటి ప్రాంతాలకు రైళ్లు వెళుతూ ఉంటాయి. అయితే ఈ స్టేషన్ ద్వారా ఎక్కువగా ఆదాయం లేకపోవడంతో రైల్వే అధికారులు పద్మావతి ఎక్స్ప్రెస్ తిరుగు ప్రయాణంలో హాల్టింగును రద్దు చేశారు. దీనిపై ఈ ప్రాంత ప్రజలంతా ఏకమై రైల్వే శాఖ అధికారులతో ఒక ఒప్పందానికి వచ్చారు. దీంతో అధికారులు సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ కు తాత్కాలిక హాల్టింగ్ కల్పించారు.

అయితే ఈ సమయంలో రైల్వే అధికారులు ఒక షరతు పెట్టారట. అయితే ఈ స్టేషన్ నుండి మూడు నెలల పాటు ఆదాయం వస్తేనే పూర్తిస్థాయిలో హాల్టింగ్ కల్పిస్తామని, లేదంటే రద్దు చేస్తామని అన్నారట. దీంతో ఆ ప్రాంత ప్రజలు హాల్టింగ్ పోకూడదని అందరూ ఏకమై ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. మొత్తం 400 సభ్యులు ఇందులో చేరారు. వీరంతా తలా కొన్ని అమౌంట్ వేసుకొని 25 వేల రూపాయల సేకరించారు. ఈ వచ్చిన సొమ్ముతో రోజు నెక్కొండ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు రైల్వే టికెట్లు కొంటున్నారు. అయితే స్టేషన్ కు ఆదాయం చూపించడం కోసమే ఈ విధంగా చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో రైల్వే హాల్టింగు పోగొట్టుకోకూడదనే ఆలోచనతోనే ఈ గ్రూప్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి రామ్ గోపాల్,వెంకన్న, మహిపాల్ రెడ్డి, శ్రీనివాసులు అంటున్నారు. ప్రస్తుతం వీరు ఈ ఆలోచన చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధమైనటువంటి కామెంట్ పెడుతున్నారు.

Tags:
Next Story
Share it