Thief's bad experience: ఆలయంలో చోరీకి యత్నం.. కట్ చేస్తే కథలో ట్విస్ట్..!

ఆలయంలో చోరీకి ప్రయత్నించిన ఓ దొంగకు పెద్ద షాక్ తగిలింది.

Thiefs bad experience: ఆలయంలో చోరీకి యత్నం.. కట్ చేస్తే కథలో ట్విస్ట్..!
X

న్యూస్ లైన్ డెస్క్: ఆలయంలో చోరీకి ప్రయత్నించిన ఓ దొంగకు పెద్ద షాక్ తగిలింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయంలో పని చేసే సురేశ్ అనే వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించాడు. హుండీని ధ్వంసం చేసి అందులో నుండి నగదును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే సురేశ్ చేయి హుండీ లోపల ఇరుక్కుపోయింది. తెల్లవారుజామునే ఆలయానికి వచ్చిన భక్తులు అతన్ని చూసి అవాక్కయ్యారు.

స్థానికులు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అవుతోంది. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు సురేశ్ చేతిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:
Next Story
Share it