VIRAL: ఏవండోయ్ ...విన్నారా..ఆవిడకి ఇద్దరు కావాలట!

ఆమెకు ముగ్గురు పిల్లలు ..చక్కని మొగుడు ..అందమై సంసారం. కాని ఆవిడకి మాత్రం మరో వ్యక్తి కావాలి.ప్రియుడు ( LOVER) తో చాలా రహస్యంగా పెట్టుకుంది.

VIRAL: ఏవండోయ్ ...విన్నారా..ఆవిడకి ఇద్దరు కావాలట!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆమెకు ముగ్గురు పిల్లలు ..చక్కని మొగుడు ..అందమై సంసారం. కాని ఆవిడకి మాత్రం మరో వ్యక్తి కావాలి.ప్రియుడు ( LOVER) తో చాలా రహస్యంగా పెట్టుకుంది. విషయం బట్టబయలు కావడంతో తనకు భర్తతోపాటు ప్రియుడు కూడా కావాలంటూ మొండిపట్టు పట్టింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోయే సరికి కరెంట్ పోల్ ఎక్కి మరీ నిరసన తెలిపింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను కాపాడారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ పిప్రాయిచ్‌ ప్రాంతానికి చెందిన సుమన్ దేవి( SUMAN DEVI) (34) అనే మహిళకు చాలా ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం . అయితే గత ఏడేళ్లుగా ఆ మహిళ స్థానికంగా ఉంటున్న మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి.

కాని భర్త , ప్రియుడు ముగ్గురు కలిసి ఉందామని అడిగింది. అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అయితే ఈ ఒప్పందానికి భర్త అంగీకరించలేదు. దీంతో సుమన్ దేవి ఇప్పటికే రెండు సార్లు ఆత్మహత్యయత్నం చేసింది. నెల రోజుల క్రితం ఓ భవనం 5వ అంతస్తు నుంచి కింది దూకేందుకు యత్నించింది. అది విఫలయం కావడంతో రైలు పట్టాలపైకి వచ్చి మరోమారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇప్పుడు ఇక ఎలాగైనా..భర్తను ఒప్పించే పనిలో భాగంగా ..కరెంట్ పోల్ ఎక్కి నిలబడింది. అయినా భర్తతో ,ప్రియుడు తో కలిసి ఉండడాన్ని చెప్పడంతో ఆ భర్త అంగీకరించలేదు.

Tags:
Next Story
Share it