VIral:వరుడి కోసం ఈమె పెట్టిన కండీషన్లు చూస్తే దిమ్మదిరిగిపోద్ది..!

ఒకప్పుడు చాలామంది ఆడపిల్లలు తల్లిదండ్రులు ఏ అబ్బాయిని చూపించి పెళ్లి చేసుకోమంటే ఆ అబ్బాయిని చేసుకునేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది.

VIral:వరుడి కోసం ఈమె పెట్టిన కండీషన్లు చూస్తే దిమ్మదిరిగిపోద్ది..!
X

న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు చాలామంది ఆడపిల్లలు తల్లిదండ్రులు ఏ అబ్బాయిని చూపించి పెళ్లి చేసుకోమంటే ఆ అబ్బాయిని చేసుకునేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. అమ్మాయిలే అబ్బాయిలను సెలెక్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక విధంగా చూస్తే మంచి పరిణామమే అని చెప్పవచ్చు. అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకోవడం మంచి పద్ధతి. కానీ ఆకాశానికి నిచ్చెన వేస్తా అంటే కుదరదు. తాజాగా ఒక అమ్మాయి తను చేసుకునేటువంటి అబ్బాయి ఈ విధంగా ఉంటేనే పెళ్లి చేసుకుంటావని చెప్పింది. తన ఇష్టా ఇష్టాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను అంబర్ అనే వారు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు అనే వివరాలు చూద్దాం.

ముంబైకి సంబంధించినటువంటి 37 సంవత్సరాల మహిళ సంవత్సరానికి నాలుగు లక్షల జీతం సంపాదిస్తోంది. అయితే ఈమె చేసుకునే భర్త మాత్రం ఓ రేంజ్ లో ఉండాలని కోరుకుంటుంది. తనకు కాబోయే భర్త సంవత్సరంలో కనీసం కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి అయి ఉండాలని అంటోంది. అంతేకాకుండా డాక్టర్ లేదంటే చార్టెడ్ అకౌంట్ జాబ్ చేస్తే మరింత ఇష్టమని చెబుతోంది. అలాగే తాను చేసుకునే వ్యక్తి ముంబైలో సొంత ఇల్లు లేదంటే ఉద్యోగం, వ్యాపారాలు చేస్తూ ఉండాలని అంటోంది. మొత్తానికి విద్యావంతుడు అయినటువంటి వ్యక్తిని ఆమె కోరుకుంటుంది.. అయితే ఆమె ఈ విషయాలన్నీ చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇప్పటికే లక్షల మంది ఈ పోస్టును లైక్ చేశారు, వేలాది మంది షేర్ చేస్తున్నారు.

గంట గంటకు ఈ పోస్టుకు ఆదరణ పెరుగుతోంది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండియాలో ఎక్కువ జాబ్ ద్వారా సంపాదించే వ్యక్తులు కేవలం 1.7 లక్షల మంది ఉన్నారు. అలాంటప్పుడు 37 సంవత్సరాల వయసు ఉన్న నిన్ను ఎందుకు చేసుకుంటారు, నువ్వు అలాగే కలలు కంటు ఉంటే 0.01% కూడా నువ్వు కోరుకునే వ్యక్తి దొరకడం కష్టమని కామెంట్ పెట్టారు. అలాగే మరో వ్యక్తి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఏది కావాలో అది ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. మరొకరు నువ్వు వరుడుని ఎంచుకునే హక్కు ఉంది, నిన్ను తిరస్కరించే హక్కు పురుషులకు కూడా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. నీకు ఇలాంటి వ్యక్తులు కావాలి అంటే యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, వంటి దేశాలలో దొరుకుతారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విధంగా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Tags:
Next Story
Share it