viral: దోమల దండయాత్ర తో ఉలిక్కిపడ్డ నగరం..ఎక్కడంటే?

ప్రాజెక్టుల వల్ల అక్కడ నీటి ప్రవాహం తగ్గి, మురుగు చేరి దోమల వృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది

viral: దోమల దండయాత్ర తో  ఉలిక్కిపడ్డ నగరం..ఎక్కడంటే?
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దండయాత్ర అంటే మళ్లీ హిస్టరీ అనుకుంటారు అంతా. కాని దండయాత్ర జరిగింది ఈ రోజుల్లోనే అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అయినా ఎలా రాజులు లేవు ..రాజులు ఏలే రాజ్యాలు లేవే అంటారా. ఎక్కడో కాదు ఇండియాలోనే ..ముంబై( mumbai) లోని పూణే,( pune) ముంధ్వా, కేశవనగర్( keshav nagar) , ఖరాడి ( kharadi) ప్రాంతాలలో దోమల దండయాత్ర ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. పూణే వాసులు ఇప్పుడు దోమల సమస్యతో పోరాటం చేస్తున్నారు.

ఎక్కడైనా ఉన్న సమస్యే కదా అంటారేమో ..ఈ రేంజ్ లో ఎక్కడా లేదు.గుంపు గుంపులుగా అసలు మనిషి కనిపిస్తే చాలు పీక్కుతినేద్దాం అనే రేంజ్ లో దాడి చేస్తున్నాయట.కాసేపు బాల్కనీలో కూర్చోవాలంటే ఇబ్బంది పడేంతగా దోమలు విజృంభిస్తున్నాయి. బయట పార్కులకు వెళ్లడం, పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లడం సైతం ప్రస్తుతం నిషేధించబడ్డాయి అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళుతున్నారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మూల ముఠా నది గర్భంలో కొనసాగుతున్న ప్రాజెక్టులలో, ఆనకట్టతో పాటు నీటి శుద్ధి కర్మాగారం ఉన్నాయని చెబుతున్నారు. ప్రాజెక్టుల వల్ల అక్కడ నీటి ప్రవాహం తగ్గి, మురుగు చేరి దోమల వృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని, ఫలితంగా దోమల తుఫాను తమ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతుందని వారు అంటున్నారు.


Tags:
Next Story
Share it