Viral news:మనిషి తలపై కొమ్ము..చూస్తే షాకే..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు క్షణాల్లో తెలిసిపోతున్నాయి. మూడు కాళ్లతో పుట్టిన మనుషులు, ఏనుగు కడుపులో పందిపిల్ల

Viral news:మనిషి తలపై కొమ్ము..చూస్తే షాకే..!
X

న్యూస్ లైన్ డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు క్షణాల్లో తెలిసిపోతున్నాయి. మూడు కాళ్లతో పుట్టిన మనుషులు, ఏనుగు కడుపులో పందిపిల్ల అంటూ ఎన్నో వింత సంఘటనలు సోషల్ మీడియాలో రావడం చూస్తూ ఉన్నాం. ఇందులో కొన్ని ఫేక్ వార్తలు ఉంటే మరి కొన్ని నిజమైన వార్తలు ఉంటాయి. తాజాగా ఒక మనిషి తలపై కొమ్ము ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పశువుల తలపై ఏ విధంగా కొమ్ము పెరుగుతుందో ఆ విధంగానే మనిషి తలపై కూడా కొమ్ము పెరుగుతూ ఉంటుంది. మరి ఆ కొమ్ము ఉన్న వ్యక్తి ఎవరు. అది ఎందుకు పెరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో రహిలి విలేజ్ కీ చెందినటువంటి 65 సంవత్సరాల శ్యామ్లాల్ యాదవ్ తలకు 2004లో గాయం అయిందట. ఆ గాయం కాస్త మెల్లిమెల్లిగా పెరగడం ప్రారంభించిందట. అలా కొన్నాళ్లకు అది కొమ్ముల రూపాంతరం చెందింది. దీంతో శ్యామ్ లాల్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో నాముషీగా ఫీల్ అయినటువంటి శ్యామ్లాల్ వైద్యుని సంప్రదించారు. ఆయనకు పరీక్షలు చేసిన వైద్యులు ఈ కొమ్ము పెరగడానికి కారణాలు తెలుసుకున్నారు.

"కటానియస్ హార్ను" అని పిలుస్తారట. ఇది జంతువుల కొమ్ముల కనిపించే ఒక అరుదైన చర్మం పెరుగుదల అని వారు చెబుతున్నారు. ఒక్కోసారి ఈ సమస్య క్యాన్సర్ కు కూడా దారి తీయవచ్చు అని అంటున్నారు. 65 నుంచి 75 ఏళ్ల వృద్ధుల్లో అరుదుగా కొమ్ములు పెరగడం జరుగుతుందట. ఒకవేళ ఇది పెరుగుదల ఆగకపోతే తప్పనిసరిగా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు.

Tags:
Next Story
Share it