Rupert Murdoch: 93 ఏళ్ల వ‌య‌సులో ..ఐదో పెళ్లి చేసుకున్న రూపర్ట్ మర్ధోక్ !

93 ఏళ్ల మీడియా మొగల్ శనివారం 67 ఏళ్ల ఎలెనా జుకోవా తో ఐదో పెళ్లి చేసుకున్నారు. అయితే తన కంటే 25 యేళ్లు అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నానంటున్నాడు మర్దోక్.

Rupert Murdoch: 93 ఏళ్ల వ‌య‌సులో ..ఐదో పెళ్లి చేసుకున్న రూపర్ట్ మర్ధోక్ !
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆస్ట్రేలియన్( AUSTRILIAN) -అమెరికన్( AMERICAN) వ్యాపారవేత్త పెట్టుబడిదారు మీడియా దిగ్గజం మర్దోక్( MARDOK) ఐదోసారి పెళ్లి చేసుకుంటున్నారు. 93 ఏళ్ల మీడియా మొగల్ శనివారం 67 ఏళ్ల ఎలెనా జుకోవా( ELEN JUCOVA)తో ఐదో పెళ్లి చేసుకున్నారు. అయితే తన కంటే 25 యేళ్లు అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నానంటున్నాడు మర్దోక్.

ఇంతకీ ఈ మార్దోక్ ఎవరంటే...కీత్ రూప‌ర్ట్ మ‌ర్దోక్ వాల్ స్ట్రీట్ జర్నల్, ది సన్, ది టైమ్స్( THE TIMES), న్యూయార్క్ పోస్ట్, హెరాల్డ్ సన్, ఫాక్స్ న్యూస్‌, ది డైలీ టెలిగ్రాఫ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా అవుట్‌లెట్‌లకు యజమాని.




ఇక ఈ వివాహ వేడుక‌కు పలువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. అతిథులలో న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ యజమాని రాబర్ట్ కె క్రాఫ్ట్, న్యూస్ కార్ప్ సీఈఓ రాబర్ట్ థామ్సన్ ఉన్నారు. ఇక మ‌ర్దోక్‌కు మొద‌ట పాట్రీషియా బుక‌ర్‌తో పెళ్లి కాగా 1960లో విడిపోయారు. ఆ త‌ర్వాత మ‌రియామ‌న్‌, విన్‌డీ డెండ్‌, జెర్రీ హాల్‌ల‌నూ పెళ్లి చేసుకున్నా ...పెద్ద గా వర్కవుట్ కాలేదు.

ఈ అవుట్‌లెట్లన్నీ మ‌ర్దోక్‌ కంపెనీ న్యూస్ కార్ప్( NEWS CARP) నిర్వ‌హిస్తోంది. 93 ఏళ్ల ఆయ‌న‌ మార్చి 2, 2022 నాటికి యునైటెడ్ స్టేట్స్‌లో 31వ ధనవంతుడు. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలో 71వ కుబేరుడు. రూప‌ర్ట్ మ‌ర్దోక్‌ నికర విలువ 21.7 బిలియన్ డాల‌ర్లు. అయితే ఈ కుభేరుడికి ఈ వయసులో 93 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు.

Tags:
Next Story
Share it