Uk పార్లమెంటు బరిలో కరీంనగర్ వాసి..!

ఎన్నికలు వచ్చాయంటే మనదేశంలో ఎంతో మంది అసెంబ్లీ, పార్లమెంటు బరిలో నిలుస్తూ ఉంటారు. మన ఇండియాలో మన దేశం వారు పోటీ చేయడం అనేది పెద్ద గొప్పేమీ కాదు. కానీ

Uk పార్లమెంటు బరిలో కరీంనగర్ వాసి..!
X

న్యూస్ లైన్ డెస్క్: ఎన్నికలు వచ్చాయంటే మనదేశంలో ఎంతో మంది అసెంబ్లీ, పార్లమెంటు బరిలో నిలుస్తూ ఉంటారు. మన ఇండియాలో మన దేశం వారు పోటీ చేయడం అనేది పెద్ద గొప్పేమీ కాదు. కానీ ఇండియా నుంచి వెళ్లి, పరాయి దేశంలో రాజకీయంగా పోటీ చేసి ఎదగడం అనేది ఎంతో గొప్ప. అలాంటిది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి ఉదయ్ నాగరాజు అనే వ్యక్తి యూకే పార్లమెంట్ బరిలో నిలుచున్నాడు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

ఉదయ్ నాగరాజు ఎంతో పేరుగాంచిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ గవర్నెన్స్ లో పీజీ పూర్తి చేశారు. ఆయన అక్కడే క్షేత్రస్థాయి సమస్యలపై పోరాడుతూ, వక్తగా, రచయితగా మంచి గుర్తింపు సాధించాడు. అలాగే ఉద్యమాలు, పోరాటాలు, ప్రజా సమస్యలపై ప్రశ్నించడం లాంటి వాటిలో చాలా చురుకుగా ఉంటాడు. అలాంటి ఉదయ్ నాగరాజు యూకేలో లేబర్ పార్టీ తరఫున బరిలో నిలుస్తున్నారు. అయితే ఈయనది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం. తెలంగాణలో పుట్టిన ఈయన నార్త్ బెడ్ ఫోల్డ్ షైర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎంపిక అయ్యాడట. అక్కడ విద్యార్థుల సమస్యలపై అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇస్తూ, ప్రతి ఒక్కరికి పరిచయమయ్యాడు.

అంతేకాకుండా యూకే ప్రభుత్వ వ్యతిరేక సెంటిమెంటు పెరగడంతో, లేబర్ పార్టీకి తదుపరి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయి. దీంతో ఆయనకు అక్కడ పార్లమెంటరీ బరిలో పోటీ చేసేందుకు అవకాశం వచ్చింది. అయితే ఉదయ్ నాగరాజు భారత సంతతికి చెందిన లేబర్ పార్టీ సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారట. ఈ విధంగా ఎన్నో నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఆయన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుటుంబీకులతో బంధుత్వం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా రాజకీయ నేపథ్యం నుంచి వెళ్లిన ఫ్యామిలీ కాబట్టి ఆయనకు ఆ లక్షణాలు ఉండడం కామనని కొంతమంది తెలిసినవారు అంటున్నారు.

Tags:
Next Story
Share it