Sumatra Island: ఇండోనేషియాలోని సుమిత్రా దీవిలో వరదలు

రుతుపవన వర్షాలు, మౌంట్ మరాపి నుంచి వెల్లువెత్తిన కోల్డ్ లావా ప్రవాహం కారణంగా నది బద్దలై పశ్చిమ సుమిత్రా ప్రావిన్సులోని నాలుగు జిల్లాలను వరద ముంచెత్తింది.

Sumatra Island: ఇండోనేషియాలోని సుమిత్రా దీవిలో వరదలు
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో( SUMITHRA ILAND) 37 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో జనాలు కొట్టుకుపోయారు. రుతుపవన వర్షాలు( RAINS), మౌంట్ మరాపి( MOUT MARAPI) నుంచి వెల్లువెత్తిన కోల్డ్ లావా ప్రవాహం కారణంగా నది బద్దలై పశ్చిమ సుమిత్రా ప్రావిన్సులోని నాలుగు జిల్లాలను వరద ముంచెత్తింది. దాదాపు వందకు పైగా భవనాలు కొట్టుకుపోయాయి.

కోల్డ్ కోవాను ( COLD COVA)లహర్‌గా( LEHAR) కూడా పిలుస్తారు. ఇది అగ్నిపర్వత పదార్థాలు, గులకరాళ్ల మిశ్రమంతో తయారవుతుంది. ఇప్పటికే రెస్క్యూ సిబ్బంది 19 మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అదృశ్యమైన 18 మంది కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వర్షాలు భారీగా పడినప్పుడు అగ్నిపర్వత వ్యర్ధాలు...కొండపై నుంచి ఇవి పొంగుకొని వస్తాయి. దీని కారణంగానే గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం జరిగిందని అంటున్నారు రెస్క్యూ టీం. రెండు నెలల క్రితమే పశ్చిమ సుమ్రతాలోని పెసిసిర్ సెలాటన్, పడాంగ్ పరియమన్ జిల్లాల్లో భారీ వర్షాలు, అకస్మాత్తు వరదల కారణంగా 21 మంది మృతి చెందారు. ఐదుగురు కనిపించకుండా పోయారు. అంతలోనే దీవిని మరోమారు ఫ్లాష్‌ఫ్లడ్స్ ముంచెత్తి మరికొందరిని బలితీసుకున్నాయి.

Tags:
Next Story
Share it