Israel: మాల్దీవులకు కౌంటర్ ఇచ్చిన ఇజ్రాయిల్

మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయానికి ఇజ్రాయెల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తమ పౌరులు భారత్ లోని లక్షద్వీప్ కు వెళ్లాలని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

Israel: మాల్దీవులకు కౌంటర్ ఇచ్చిన ఇజ్రాయిల్
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పాలస్తీనా భూభాగంలోని హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా ఇజ్రాయిల్ పౌరులు తమ దేశంలో అనుమతించమంటు కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంది మాల్దీవ్స్.మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయానికి ఇజ్రాయెల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తమ పౌరులు భారత్ లోని లక్షద్వీప్( LAKSHADWEEP) వెళ్లాలని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

ఇంతకీ ఆ ప్రకటనలో ఏముందంటే... "ఇకపై ఇజ్రాయెల్( ISRAEL) దేశస్థులను అనుమతించబోమని మాల్దీవులు చేసిన ప్రకటన కారణంగా ...మాల్దీవ్స్ ( MALDWEEP)కంటే అధ్భుతమైన బీచ్ లు భారతదేశంలో ఉన్నాయని ..వాటి వివరాలు ఇజ్రాయిల్ లో పూర్తిగా తెలుపుతుందని అక్కడికి వెళ్లాలని పిలుపునిచ్చింది. ఈ భారత బీచ్ ( INDIAN BEACH) లలో ఇజ్రాయెల్ పర్యాటకులకు హార్దిక స్వాగతం లభిస్తుంది. అత్యంత ఘనమైన ఆతిథ్యం అందిస్తారు. ఇప్పటివరకు మన దౌత్యవేత్తలు పర్యటించిన ప్రాంతాల ఆధారంగా ఈ బీచ్ లను సిఫారసు చేస్తున్నాం" అంటూ భారత్ లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది. అంతేకాదు, లక్షద్వీప్, గోవా( GOA) , అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్( ILANDS) , కేరళ ( KERALA) బీచ్ ల ఫొటోలను కూడా పంచుకుంది.

Tags:
Next Story
Share it