Alvin Pharma Company: ఫార్మా కంపెనీలో అదుపులోకి రాని మంటలు

రంగారెడ్డి జిల్లా (rangareddy district) నందిగామ మండల (nandigama mandal) కేంద్రంలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో (Alvin pharma company) శుక్రవారం భారీ అగ్నిప్రమాదం (fire accident) సంభవించిన విషయం తెలిసిందే. అయితే 18 గంటలు గడిచినా మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు తెలిపారు.

Update: 2024-04-27 07:31 GMT

న్యూస్ లైన్ డెస్క్: రంగారెడ్డి జిల్లా (rangareddy district) నందిగామ మండల (nandigama mandal) కేంద్రంలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో (Alvin pharma company) శుక్రవారం భారీ అగ్నిప్రమాదం (fire accident) సంభవించిన విషయం తెలిసిందే. అయితే 18 గంటలు గడిచినా మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు తెలిపారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఇంకా తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ ప్రమాదంలో ఓ బాలుడు 50 మంది ప్రాణాలను కాపాడినట్లు సమాచారం. స్థానికంగా నివసించే సాయిచరణ్ (sai charan) అనే బాలుడు మంటలను గమనించి భవనం పైకెక్కి తాడు కట్టాడు. ఆ తాడు సహాయంతో బిల్డింగ్‌లోని కార్మికులంతా కిందకు దిగారు. కాగా వెల్డింగ్ పనుల వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారుల అనుమానిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో కంపెనీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News