AP: వాతావరణ శాఖ కీలక ప్రకటన

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగ భగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఈ సీజన్‌లో ఇప్పటికే మూడుసార్లు హీట్ వేవ్ అలెర్ట్ చేసింది.

Update: 2024-04-25 12:54 GMT

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగ భగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఈ సీజన్‌లో ఇప్పటికే మూడుసార్లు హీట్ వేవ్ అలెర్ట్ చేసింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో ఏపీ వాతవారణ శాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది. రేపు రాష్ట్రంలోని 1974 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలు ఎవరు ఇంటి నుంచి ఎక్కువగా బయటకి రావోద్దని తెలిపింది. బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఉష్ణోగ్రతల నేపథ్యంలో అవసరానికి మించి ఎండల్లో తిరగోద్దని విలైనంత వరకు ఇంట్లోనే ఉండాలే చూసుకోవాలని అధికారుల పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags:    

Similar News